ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇది కదా లైవ్ మ్యూజిక్ అంటే.. ఈ గిటారిస్ట్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

ABN, Publish Date - Mar 27 , 2025 | 10:51 AM

ఓ వ్యక్తి గిటార్ వాయిస్తూ వీడియో తీసుకుంటున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. అతను అసలైన గిటార్ వాయించి ఉండుంటే ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరమే ఉండేది కాదు. అయితే ఇతను చేసిన నిర్వాకం చూసి అవాక్కవుతున్నారు..

‘‘మనిసన్నాకా కూసింత కలాపోసన ఉండాల’’.. అని ఓ సినీ కవి మాటలను కొందరు సీరియస్‌గా తీసుకుంటుంటారు. అందులోనూ ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఏవేవో ప్రయోగాలు చేస్తూ, ఆ వీడియోలన్నింటినీ నెట్టింట్లోకి వదులుతున్నారు. వీటిలో కొన్ని వీడియోలను చూసినప్పుడు నవ్వు వస్తే.. మరికొన్ని వీడియోలను చూసిప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్లింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గిటార్ ప్లే చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అసలైన లైవ్ మ్యూజిక్ అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గిటార్ వాయిస్తూ (Man playing the guitar) వీడియో తీసుకుంటున్నాడు. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ సందేహం. అతను వాయిస్తున్నది అసలైన గిటార్ కాదు.. గిటార్ ఆకారంలో ఉన్న ఇనుప వస్తువు.

Viral Video: టెంట్ కింద పంట కోత.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా..


ఇనుప రేకును గిటార్ ఆకారంలో కట్ చేసిన యువకుడు.. దానిపై వెల్డింగ్ హ్యాండిల్‌తో నిప్పులు పుట్టిస్తూ గిటార్ వాయిస్తున్నట్లు నటిస్తున్నాడు. దూరం నుంచి చూసేవారికి.. అతను గిటార్ వాయిస్తుంటే అందులో నుంచి నిప్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా ఇతను ఇనుప గిటార్‌తో నిప్పులు పుట్టిస్తూ లైవ్ మ్యూజిక్ ఇస్తున్నాడన్నమాట.

Funny Viral Video: చోరీ చేయడంలోనూ భార్యకు ట్రైనింగ్.. చివరకు ఇద్దరూ కలిసి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది కదా అసలైన లైవ్ మ్యూజిక్ అంటే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లు, 2.45 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చూసేందుకు పిచ్చివాడైనా.. చేసిన పని చూస్తే.. శభాష్ అనాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2025 | 10:51 AM