ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Watch Video: చదవాలనే ఆసక్తి ఉండాలే గానీ.. పరిస్థితులతో పనే లేదు.. కావాలంటే ఇతన్ని చూడండి..

ABN, Publish Date - Jun 07 , 2025 | 01:43 PM

కొందరు యువకులు యూనిఫామ్ ధరించి, ఓ కార్యక్రమంలో భోజనం వడ్డిస్తుంటారు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. వారిలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా సదరు యువకుడి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు..

ఆసక్తి, పట్టుదల ఉండాలే గానీ ఏ పరిస్థితుల్లో నైనా.. ఎలాంటి పనైనా చేసేయొచ్చు. కొందరు వయసులో ఉండి కూడా బాధ్యతలు గాలికొదిలేసి జులాయిగా తిరుగుతుంటారు. మరికొందరు చిన్న వయసులోనే బాధ్యతలను భుజాన వేసుకుని, మరోవైపు వారి చదువును కూడా కొనసాగిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా మన చుట్టు పక్కల అనేక మందిని చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు భోజనం వడ్డిస్తూనే మరో వైపు చేస్తున్న పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. బాధ్యతలు, చదువును బ్యాలెన్స్ చేశాడుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు యూనిఫామ్ ధరించి, ఓ కార్యక్రమంలో భోజనం వడ్డిస్తుంటారు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. వారిలో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ప్లేటు పట్టుకెళ్లిన అతిథికి ఆ యువకుడు భోజనం వడ్డించాడు.


అయితే అతను ఓ వైపు వడ్డిస్తూ, మరో వైపు చేస్తున్న పని చూసి ఆ అతిథి అవాక్కయ్యాడు. భోజనం వడ్డిస్తున్న ఆ యువకుడు.. మరోవైపు తన ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాస్‌కు హాజరై.. (man listens to lessons in online class while serving food) బుద్ధిగా పాఠాలు వింటున్నాడు. చిన్న వయసులోనే ఇలా బాధ్యతలను నిర్వర్తిస్తూ, మరోవైపు చదువును కొనసాగిస్తున్న ఇతడి పట్టుదల చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ యువకుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి’.. అంటూ కొందరు, ‘భవిష్యత్తులో ఇతను ఉన్నత స్థానాలకు చేరుకుంటాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 430కి పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 02:49 PM