Viral Video: ఇంజెక్షన్‌తో బల్బ్‌నే వెలిగించాడుగా.. ఇతడి ప్రయోగం చూస్తే షాకవ్వాల్సిందే..
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:53 PM
సాధారణంగా ఇళ్లలో విద్యుత్ బల్బ్‌లన్నీ బోర్డుకు అనుసంధానం చేసి ఉంటాయి. స్విచ్‌ల ద్వారా వాటిని ఆఫ్, ఆన్ చేయొచ్చనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా సెట్ చేశాడు.
చాలా మంది ఇళ్లలో దొరికే వస్తువులతో వస్తువులతో వింత వింత ప్రయోగాలను చేయడం చూస్తుంటాం. కొందరు టేబుల్ ఫ్యాన్‌తో ఏసీ తరహా ఏర్పాట్లు చేస్తే.. మరికొందరు వాడి పడేసిన పేస్టు ట్యూబ్‌లను కొళాయి మూతలుగా వాడడం చూస్తుంటాం. ఇంకొందరేమో ఏకంగా గ్యాస్ స్టవ్‌ను బాత్రూంలో షవర్‌లా వాడడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఇంజెక్షన్ సాయంతో బల్బ్ వెలిగించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇంజెక్షన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఇళ్లలో విద్యుత్ బల్బ్‌లన్నీ బోర్డుకు అనుసంధానం చేసి ఉంటాయి. స్విచ్‌ల ద్వారా వాటిని ఆఫ్, ఆన్ చేయొచ్చనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా సెట్ చేశాడు.
Funny Viral Video: ఇదేం వింత పరీక్షరా నాయనా.. వాషింగ్ మెషిన్‌లో రాయి వేయడంతో.. చివరకు..
స్విచ్ లేకుండా దాని స్థానంలో ఇంజెక్షన్ తీసుకున్నాడు. ప్లాస్టిక్ సిరంజ్ తీసుకుని దాన్ని బల్బ్‌కు సంబంధించిన రెండు వైర్లలో ఒకదాని మధ్యలో ఏర్పాటు చేశాడు. ఇంజెక్షన్‌ను లోపలికి చొప్పిస్తే లైటు వెలిగేలా.. బయటికి తీస్తే ఆఫ్ అయ్యేలా(man lit light bulb with syringe) ఏర్పాట్లు చేశాడు. ఫైనల్‌గా ఇంజెక్షన్ వేయగా బల్బ్ వెలగడం, వెనక్కు తీయగానే ఆరిపోవడం జరుగుతోంది. ఇలా ఇంజెక్షన్ సాయంతో బల్బ్ వెలిగించిన ఇతడి వినూత్న ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Monkeys War Viral Video: గ్రూపు గొడవలు వీటికీ తప్పలేదుగా.. కోతులన్నీ ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇంజెక్షన్‌తో బల్బ్ ఆపరేటింగ్.. ఐడియా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇంజెక్షన్‌తో ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Sheep Funny Viral Video: కర్మ కమ్ బ్యాక్ అంటే ఇదేనేమో.. ఈ పొట్టేలు చేసిన పని చూస్తే..
ఇవి కూడా చదవండి..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 20 , 2025 | 12:53 PM