ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jugaad Viral Video: బ్రెయిన్ వాడడమంటే ఇదే.. టీని ఎలా వడకట్టేస్తున్నాడంటే..

ABN, Publish Date - Jun 05 , 2025 | 02:01 PM

ఓ వ్యక్తి కాఫీ వేడి చేస్తాడు. కాఫీ చేయడంలో వింతేమీ లేదు గానీ.. అతను కాఫీని వడగట్టిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. కాఫీ ఉడికిన తర్వాత.. దాన్ని మరో పాత్రలోకి వడగట్టాల్సి వస్తుంది. దీంతో చివరకు అతను ఏం చేశాడో మీరే చూడండి..

కొందరు తెలివితో చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకొందరు అతి తెలివితో చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. అయితే మరికొందరు ఎవరూ చేయని విధంగా చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కాఫీని వడగట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. బ్రెయిన్‌కు పని చెప్పడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కాఫీ వేడి చేస్తాడు. కాఫీ చేయడంలో వింతేమీ లేదు గానీ.. అతను కాఫీని వడగట్టిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. కాఫీ ఉడికిన తర్వాత.. దాన్ని మరో పాత్రలోకి వడగట్టాల్సి వస్తుంది.


అయితే సమయానికి అతడికి వడగట్టే గరిట కనిపించలేదు. దీంతో చివరకు తన బుర్రకు పని చెప్పాడు. చుట్టూ చూసి, చివరకు అక్కడే ఉన్న ఎడ్డు గడ్డిని తీసుకున్నాడు. దాన్ని ఫిల్టర్‌లా వాడి కాఫీ మొత్తాన్ని వడగట్టేశాడు. ఇలా ఎండు గడ్డి సాయంతో (Man filtered coffee with dry grass) కాఫీని ఫిల్టర్ చేసిన ఇతడి అతి తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కాఫీని ఇలాక్కూడా వడగట్టవచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ ఇంకొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 15 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 02:02 PM