Car stunt video: కదులుతున్న కారుపై డ్రైవర్.. సమీపానికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్.. చివరకు..
ABN, Publish Date - Aug 06 , 2025 | 05:08 PM
ఓ వ్యక్తి కారు నడుపుకొంటూ రోడ్డు పైకి వెళ్లాడు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. కారు నడుపుకొంటూ వెళ్లడంలో వింతేమీ లేకున్నా.. అతను కదులుతున్న కారుపై చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. రోడ్డుపై కారు వేగంగా వెళ్తున్న సమయంలో..
వాహనాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడుతుంటారు. కొందరు అందరిలా సాధారణంగా నడిపితే.. మరికొందరు వాటిని చిత్రవిచిత్రంగా నడుపుతూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇంకొందరు కదులుతున్న వాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారు నడుపుతున్న ఓ వ్యక్తి.. మార్గ మధ్యలో వాహనంపైకి ఎక్కి విన్యాసాలు చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా.. యమరాజును ఆహ్వానించడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారు నడుపుకొంటూ రోడ్డు పైకి వెళ్లాడు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. కారు నడుపుకొంటూ వెళ్లడంలో వింతేమీ లేకున్నా.. అతను కదులుతున్న కారుపై చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. రోడ్డుపై కారు వేగంగా వెళ్తున్న సమయంలో.. డ్రైవర్ ఉన్నట్టుండి కారు స్టీరింగ్ వదిలేసి, డోరు తీసుకుని పైకి ఎక్కేశాడు. కారు పైన బోర్లా పడుకుని పుష్ అప్స్ తీశాడు.
ఇలా చాలా దూరం వరకు అతను కారుపై ఇలా పుష్ అప్స్ తీస్తూనే ఉన్నాడు. కారులో అవతలి వైపు కూర్చున్న వారు.. ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తున్నారు. ఇలా చాలా సేపు పుష్ అప్స్ తీసిన (Man doing pushups on moving car) ఆ వ్యక్తి.. తర్వాత యథావిధిగా కారు డ్రైవింగ్ సీటులో కూర్చుని నడుపుకొంటూ వెళ్లాడు. ఈ క్రమంలో ఏమాత్రం అటూ, ఇటూ అయినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇతడి వినూత్న విన్యాసాలపై ప్రజలు మండిపడుతున్నారు.
రోడ్లపై ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘యమరాజును ఆహ్వానించడమంటే ఇదే’.. అంటూ కొందరు, ‘ఈ కారు డ్రైవర్ విన్యాసాలు మామూలుగా లేవుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాలు ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.90 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..
నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 06 , 2025 | 05:08 PM