ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Watch Viral Videos: టాలెంట్‌తో పని చేయడమంటే ఇదే.. ఇటుకలను ఎలా మోస్తున్నాడో చూస్తే..

ABN, Publish Date - Jun 15 , 2025 | 09:36 AM

ఓ యువకుడు ఇటుకలు మోసే పనిలో ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా 5, 11 లేదా 20 ఇటుకలను మోసుకుంటూ వెళ్లడం చూస్తుంటాం. కొందరు విచిత్రంగా మరిన్ని ఇటుకలను మోయడం కూడా చూస్తుంటాం. అయితే..

కొందరు కష్టపడి పని చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొందరు కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరైతే.. మిగతా వారికి సాధ్యం కాని పనులను సైతం ఎంతో సులభంగా, స్టైల్‌గా చేసేస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. శభాష్.. అని అనాలనిపిస్తుంటుంది. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. టాలెంట్‌తో పనిచేయడమంటే ఇదే... అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఇటుకలు మోసే పనిలో ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా 5, 11 లేదా 20 ఇటుకలను మోసుకుంటూ వెళ్లడం చూస్తుంటాం. కొందరు విచిత్రంగా మరిన్ని ఇటుకలను మోయడం కూడా చూస్తుంటాం. అయితే ఇప్పుడు వీడియోలో చూడబోయే వ్యక్తి ఏకంగా పదుల సంఖ్యలో ఇటుకలను ఒకే బుట్టలో వేసుకున్నాడు.

ఒక దానిపై మరొకటిగా ఇటుకలన్నింటినీ పేర్చేశాడు. వాటిని తలపై పెట్టుకున్న తర్వాత ఇంకా చాలదన్నట్లు.. రెండు చేతులతో మరిన్ని ఇటుకలను తీసుకుని, గోలం పైకి విసిరేస్తున్నాడు. అది కూడా ఎంతో స్టైల్‌గా విసిరేస్తున్నాడు. అంతెత్తు పైకి ఇటుకలను విసిరేయడంతో.. అవి కూడా నేరుగా వెళ్లి వాటిపై పడిపోతున్నాయి. ఇలా అతను పరిమితికి మించి ఇటుకలను తలపై పెట్టుకుని, ఎంతో అవలీలగా మోస్తు్న్నాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి టాలెంట్ అతి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 7.7 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 09:36 AM