ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lion Attack Viral Video: ఆడ సింహంపై హైనాల దాడి.. భగ్గుమన్న మగ సింహం.. చివరకు..

ABN, Publish Date - Aug 05 , 2025 | 06:12 PM

హైనాల గుంపు మొత్తం కలిసి ఓ ఆడ సింహాన్ని టార్గెట్ చేశాయి. ఒక్కసారిగా అన్నీ కలిసి (Hyenas attack lioness) ఆడ సింహాన్ని చుట్టుముట్టేశాయి. కొన్ని దాన్ని తికమక పెడుతుండగా.. మరికొన్ని హైనాలు కొరుకుతూ చంపే ప్రయత్నం చేశాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆడ సింహం ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ ..

సింహాల వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సింహాల వేట ఎంత భయంకరంగా ఉంటుందో.. కొన్నిసార్లు అవి ప్రవర్తించే తీరు అంతే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైనాలన్నీ కలిసి ఆడ సింహాన్ని చుట్టుముట్టి చంపేందుకు ప్రయత్నించాయి. ఇది గమనించిన మగ సింహం.. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హైనాల గుంపు మొత్తం కలిసి ఓ ఆడ సింహాన్ని టార్గెట్ చేశాయి. ఒక్కసారిగా అన్నీ కలిసి (Hyenas attack lioness) ఆడ సింహాన్ని చుట్టుముట్టేశాయి. కొన్ని దాన్ని తికమక పెడుతుండగా.. మరికొన్ని హైనాలు కొరుకుతూ చంపే ప్రయత్నం చేశాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆడ సింహం ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ దాని వల్ల సాధ్యం కాదు.

ఇక ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆడ సింహం ప్రమాదంలో ఉన్నట్లు మగ సింహం గమనించింది. ఈ సీన్ చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగున పరుగున అక్కడికి చేరుకుంటుంది. ఆడ సింహాన్ని చంపాలని చూసిన (Male lion attacks hyenas) హైనాలపై విరుచుకుపడుతుంది. వాటిలో ఒక హైనాను పట్టుకుని కొరికే ప్రయత్నం చేస్తుంది. అయితే హైనాలన్నీ చుట్టూ చేరి ఎలాగోలా సింహం బారి నుంచి తమ సహచరుడిని కాపాడుకుంటాయి. ఆ తర్వాత అన్నీ కలిసి బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతాయి.

ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరుగుతుంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది కదా ప్రేమంటే’.. అంటూ కొందరు, ‘మగ సింహం ఫైట్ మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 06:12 PM