ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

World's Richest Village: భారత్‌లోని ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.. ఇక్కడి వారు ఎంత రిచ్ అంటే..

ABN, Publish Date - Aug 10 , 2025 | 07:31 PM

గుజరాత్‌లోని మాధాపార్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత సంపన్న గ్రామాల్లో ఒకటిగా పేరుపొందింది. మరి ఇక్కడి సంపద వెనకాల సీక్రెట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Madhapar richest village India

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ గ్రామాలంటే మనకు సాధారణంగా ప్రకృతి అందాలు, పాడి పంటలు, చేలల్లో పనిచేసే రైతులు గుర్తొస్తారు. కానీ ఈ కథనంలో మనం చెప్పుకోబోయే గ్రామంలో అంతా సంపన్నులే. ప్రతి వ్యక్తీ దాదాపుగా ఒక లక్షాధికారే. గుజరాత్‌లో ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వాటిల్లో ఒకటిగా పేరు పొందింది. మరి ఈ గ్రామం విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

కచ్‌ జిల్లాలోని మాధాపార్ గ్రామం దేశంలోనే అత్యంత సంపన్నమైనది. ఇక్కడి జనాభా సుమారు 92 వేలు. దాదాపు 7600 ఇళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి వారికి అవసరాల కోసం ఏకంగా 17 బ్యాంక్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటేనే గ్రామస్థలు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ బ్యాంకుల్లో సుమారు రూ.5 వేల కోట్లు ఉండొచ్చని ఓ అంచనా. ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది విదేశాల్లో సెటిలయ్యారు. కానీ మాతృభూమిపై మమకారంలో ఈ ఎన్నారైలంతా తమ సొంత గ్రామానికి డబ్బు పంపిస్తూ ఉంటారు. సొంత ఖర్చులతో ఇక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చేసి గ్రామాన్ని గుర్తు పట్టలేనంతగా మార్చేశారు. విద్య, వైద్యం విషయంలో గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎన్నారైలు అన్ని ఏర్పాట్లు చేశారు.

కచ్ ప్రాంతానికి చెందిన మిస్త్రీ కమ్యూనిటీ వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతారు. గుజరాత్‌లో పలు దేవాలయాలు, చారిత్రక కట్టడాలను ఏర్పాటు చేసిన వర్గంగా మిస్త్రీలకు పేరుంది. అయితే, మాధాపార్‌లో కాలక్రమంలో అన్ని వర్గాల వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ సాంస్కృతిక వైభవానికి ఈ గ్రామం చిహ్నంగా నిలుస్తోంది.

మాధాపార్ గ్రామంలో స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులు, హెల్త్ సెంటర్‌లు, పార్కులు, పక్కా రోడ్లు వంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి. ఇది గ్రామమే అయినా నగరాలతో సరితూగే మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నారు. కష్టించి పని చేయడం, నిబద్ధత, మూలాలపై మక్కువ ఉంటే ఎంతటి అభివృద్ధి సాధించొచ్చో తమ గ్రామాన్ని చూసి అర్థం చేసుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

భూమికి చేరిన 4.56 బిలియన్ ఏళ్ల నాటి ఉల్క శకలం

నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Aug 10 , 2025 | 07:41 PM