ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lion Funny Video: చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

ABN, Publish Date - Aug 13 , 2025 | 07:22 PM

ఓ వ్యక్తి నది ఒడ్డున కూర్చుని చేపలు పడుతుంటాడు. అయితే అక్కడే లోపలికి రావొద్దు అని రాసి ఉంటుంది. అయినా ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా వెళ్లి చేపలు పడుతుంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంటుంది.

సింహం పేరు వింటేనే సగం చచ్చినంత పనవుతుంటుంది. ఇక పొరపాటున కళ్లెదరుగా కనిపిస్తే ప్రాణాలు పోవడం మాత్రం ఖాయం. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నదిలో చేపలు పడుతుండగా.. సింహం వెనుకే వెళ్లి నిలబడింది. ఈ వీడియో చూస్తుంటే గ్రాఫిక్స్‌లా అనిపిస్తున్నా కూడా నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి నది ఒడ్డున కూర్చుని (Fishing) చేపలు పడుతుంటాడు. అయితే అక్కడే ‘Do Not Enter’.. అని రాసి ఉంటుంది. అయినా ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా వెళ్లి చేపలు పడుతుంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంటుంది. ఓ పెద్ద సింహం మెల్లిగా నది వైపు వెళ్లింది.

సరిగ్గా ఆ వ్యక్తి కూర్చున్న చోటుకు వెళ్లిన సింహం.. (Lion standing behind Man) అతడి వెనుకే నిలబడింది. ఇంతలో అతను పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు వెనక్కు తిరిగాడు.. అంతే.. ఇలా తిరగ్గానే ఎదురుగా సింహం నోరు తెరచి నిల్చుంది. దెబ్బకు అతడి గుండె జారినంత పనవుతుంది. సింహాన్ని చూసిన షాక్‌లో అతను కాసేపు అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ.. వెనక్కు జరుగుతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

అయితే ఈ వీడియోను బాగా గమనిస్తే ఇదంగా గ్రాఫిక్స్ అనే విషయం అర్థమవుతుంది. కానీ, ఎక్కడా ఆ అనుమానం రాకుండా ఎంతో రియల్‌గా క్రియేట్ చేయడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చంపకుండానే.. చనిపోయినంత పనయిందిగా’.. అంటూ కొందరు, ‘ఏఐ సాయంతో చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ కామెంట్లతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 37 వేలకు పైగా లైక్‌‌లు, 1.6 మిలియన్‌‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 07:22 PM