ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Buffalo VS Lion: దున్నపోతుపై సింహం దాడి.. ప్రాణాలు పోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..

ABN, Publish Date - Aug 03 , 2025 | 01:31 PM

ఆకలితో ఉన్న ఓ సింహం.. వేట కోసం వెతుకుతోంది. ఇంతలో దానికి నీళ్లు తాగుతున్న ఓ దున్నపోతు కనిపించింది. దీంతో వెంటనే దానిపై ఎటాక్ చేసింది. తన పవర్‌ఫుల్ పంజాతో దాడి చేసి చంపే ప్రయత్నం చేసింది. అయితే చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

సింహాలు ఒక్కసారి టార్గెట్ చేశాయంటే.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే అన్నిసార్లూ పరిస్థితి ఇలాగే ఉంటుందంటే.. ఉండదు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే.. సింహం ఎంత బలంగా ఉన్నా కూడా కొన్నిసార్లు అవతలి వైపు జంతువులు షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం దున్నపోతుపై దాడి చేసింది. అయితే ప్రాణాలు పోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహం.. వేట కోసం వెతుకుతోంది. ఇంతలో దానికి నీళ్లు తాగుతున్న ఓ దున్నపోతు కనిపించింది. దీంతో వెంటనే దానిపై ఎటాక్ చేసింది. తన పవర్‌ఫుల్ పంజాతో (Lion attacking buffalo) దాడి చేసి చంపే ప్రయత్నం చేసింది. వెనుక కాళ్లను నోటితో గట్టిగా పట్టుకుని కిందపడేసేందుకు ప్రయత్నించింది.

అయితే దున్నపోతు కూడా సింహం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. దాన్ని లాక్కుంటూ అటూ, ఇటూ తిరుగుతూ ఓపిగ్గా ప్రయత్నించింది. ఇలా ఈ రెండూ ప్రయత్నాలు చేస్తుండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. దూరంగా ఉన్న దున్నపోతుల మంద సింహం దాడి చేయడాన్ని చూసి ఎలర్ట్ అయింది. పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాయి. దున్నపోతుల రాకను చూసిన సింహం (Lion that ran away after seeing buffaloes) దెబ్బకు తోక ముడిచింది. దాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది.

దీంతో అప్పటిదాకా ప్రాణాలు పోతాయనుకున్న దున్నపోతు.. క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ దున్నపోతు అదృష్టం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘దున్నపోతు పోరాటం ఫలించింది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2300కి పైగా లైక్‌లు, 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 01:31 PM