Jatashankar Temple: అపురూప దృశ్యం.. శివుడికి అభిషేకం చేసిన గంగమ్మ
ABN, Publish Date - Jul 03 , 2025 | 07:03 AM
Jatashankar Temple: జటా శంకర్ శివాలయాన్ని బుందేల్ఖండ్ కేదార్‌నాథ్ అని పిలుస్తారు. ఈ గుడి కొండ గుహలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో పచ్‌మరి నుండి 2 కిలోమీటర్ల దూరంలో.. ఉత్తర దిశలో ఈ జటా శంకర్ గుడి ఉంది.
ఉత్తరాదిన వర్షాలు దంచికొడుతున్నాయి. వరదల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, మంగళవారం నాడు మధ్య ప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా జటా శంకర్ గుడిలో అపురూపగట్టం చోటుచేసుకుంది. గంగమ్మ శివుడికి అభిషేకం చేసింది. జటా శంకర్ గుడి కొండల మధ్యలో ఉంది. భారీ వర్షాల కారణంగా కొండపైనుంచి నీరు పెద్ద మొత్తంలో గుడిలోకి ప్రవేశించింది.
గర్భ గుడి మొత్తం నీటితో నిండిపోయింది. శివలింగంపై నీరు ధార కట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. గర్భ గుడి మొత్తం నీటితో నిండిపోయింది. పూజారి శివలింగానికి పూజలు చేస్తూ ఉన్నాడు. నడక మార్గం ఉన్న వైపు నీరు జలపాతంలా కిందకు దూకుతూ ఉంది. అక్కడి పరిస్థితి నదికి వరద పోటెత్తినట్లుగా ఉంది. పూజారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ఎంతో భక్తితో పూజ చేస్తూ ఉన్నాడు.
జటా శంకర్ ధామ్ విశేషాలు
జటా శంకర్ శివాలయాన్ని బుందేల్ఖండ్ కేదార్‌నాథ్ అని పిలుస్తారు. ఈ గుడి కొండ గుహలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో పచ్‌మరి నుండి 2 కిలోమీటర్ల దూరంలో.. ఉత్తర దిశలో ఈ జటా శంకర్ గుడి ఉంది. ఈ ప్రాంతంలో రెండు రకాల కొలన్లు ఉన్నాయి. ఒక దాంట్లో నీరు చల్లగా ఉంటుంది. మరొక దాంట్లో నీరు వేడిగా ఉంటుంది. గుహ లోపల సహజంగా ఏర్పడిన 108 శివలింగాలు కూడా ఉన్నాయి. ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. భక్తులు సహజంగా ఏర్పడిన ఈ లింగాలను పూజిస్తూ ఉంటారు.
ఇవి కూడా చదవండి
ఈ హోటల్లో అప్పు పెట్టాలంటే ఆలోచించాల్సిందే.. యజమాని ఏం రాశాడో చూస్తే..
ఐదేళ్లూ నేనే ముఖ్యమంత్రి: సిద్దరామయ్య
Updated Date - Jul 03 , 2025 | 07:12 AM