ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Traveller: మలేషియాకు వెళ్లొచ్చాక కనువిప్పు.. మన పరిస్థితి తలుచుకుని సిగ్గుపడుతున్నానంటూ భారతీయుడి పోస్టు

ABN, Publish Date - Jul 14 , 2025 | 11:25 PM

మలేషియా పర్యటన తరువాత తనకు కనువిప్పు కలిగిందని ఓ భారతీయ వ్యక్తి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. భారత్‌లో పరిస్థితులు మెరుగవుతాయన్న ఆశ లేకుండా పోయిందని సదరు నెటిజన్ వ్యాఖ్యానించారు.

India Malaysia civic comparison

ఇంటర్నెట్ డెస్క్: మలేషియాకు వెళ్లొచ్చాక తనకు కనువిప్పు కలిగిందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. భారత్‌లోని పరిస్థితులు తలుచుకుని సిగ్గుపడుతున్నానంటూ నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. అతడి అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించారు.

వియత్నాంకు వెళ్లాలని అనుకున్నా చివరి నిమిషంలో మలేషియాకు వెళ్లాల్సి వచ్చిందని ఆ నెటిజన్ చెప్పుకొచ్చారు. పెద్దగా అంచనాలేమీ లేకుండా అక్కడికి వెళ్లానని అన్నారు. కానీ అక్కడి పరిస్థితులు తను ఊహించిన దాని కంటే పూర్తి భిన్నంగా ఉండటంతో ఆశ్చర్యపోయానని అన్నారు.

‘కౌలాలంపూర్ చాలా పద్దతిగా, పక్కా ప్రణాళికతో కూడిన నిర్వహణతో ఉన్నట్టు కనిపించింది. వీధుల్లో గుంతలే లేవు. ప్రజాప్రతినిధుల ఫొటోలు బ్యానర్లు కూడా లేవు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. ప్రజల్లో పౌర సృహ కూడా ఎక్కువే. జీవన నాణ్యత అద్భుతం. ప్రజలు మర్యాదగా, స్నేహశీలురుగా కనిపించారు. ఇదంతా చూశాక నాకు భారతీయ నగరాలు గుర్తొచ్చాయి. నేను ఇండియాను వీడొద్దని సాటి భారతీయులకు చెబుతుంటా. కానీ ఇప్పుడు భారత్‌లో పర్యటిస్తున్న విదేశస్తులను తలుచుకున్నా, విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న ఎన్నారైలను తలుచుకున్నా బాధ కలుగుతోంది’ అని అన్నారు.

భారతీయులు సుపరిపాలనపై ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోందని అన్నారు. మౌలిక వసతుల కోసం కూడా సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ‘చిల్లర తగాదాల్లో పడి మనం అసలు విషయాలపై దృష్టి పెట్టట్లేదు. ఐపీఎల్, టీ20 మ్యాచులు చూస్తూ మైమరిచిపోతున్నాము. సెలబ్రిటీలు, పోలిటీషన్లకు వారి బాధ్యత గుర్తుచేయకుండా వారి ఆరాధకులుగా మారిపోతున్నాము. పరిస్థతులు మారతాయన్న ఆశ కూడా పోయింది’ అని విచారం వ్యక్తం చేశారు.

ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. విదేశీ పర్యటనల వల్ల కలిగే కనువిప్పు ఇదేనని కొందరు కామెంట్ చేశారు. ఈ అనుభవం సాటి భారతీయులకు కనువిప్పు కావాలని కొందరు కామెంట్ చేశారు.

ఇవీ చదవండి:

రూ.కోటి శాలరీతో బెంగళూరు స్టార్టప్ సంస్థ జాబ్ ఆఫర్.. కాలేజీ డిగ్రీ లేకున్నా పర్లేదని క్లారిటీ

మన జీవితాలు ఇక మారవేమో.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో

Read Latest and Viral News

Updated Date - Jul 15 , 2025 | 12:06 AM