Share News

1 Crore Job Offer: రూ.కోటి శాలరీతో బెంగళూరు స్టార్టప్ సంస్థ జాబ్ ఆఫర్.. కాలేజీ డిగ్రీ లేకున్నా పర్లేదని క్లారిటీ

ABN , Publish Date - Jul 12 , 2025 | 01:20 PM

రూ.కోటి శాలరీతో జాబ్‌కు ఎలాంటి కాలేజీ డిగ్రీ లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఓ బెంగళూరు స్టార్టప్ సంస్థ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అనేక మంది ఈ ఆఫర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

1 Crore Job Offer: రూ.కోటి శాలరీతో బెంగళూరు స్టార్టప్ సంస్థ జాబ్ ఆఫర్.. కాలేజీ డిగ్రీ లేకున్నా పర్లేదని క్లారిటీ
Rs. 1 crore Tech Job in Bengaluru

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగుల నియామకాల్లో టెక్ కంపెనీలు కొత్త కొత్త పంథాలను అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ జాబ్ ఆఫర్ సంచలనంగా మారింది. కాలేజీ డిగ్రీ లేకపోయినా రూ.కోటి వార్షిక శాలరీతో జాబ్ ఇస్తామంటూ స్మాలెస్ట్ ఏఐ అనే సంస్థ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

ఫుల్ స్టాక్ లీడ్ కోసం సంస్థ ఫౌండర్ ఈ జాబ్ ప్రకటన విడుదల చేశారు. ఏటా రూ.60 లక్షల ఫిక్డ్స్ శాలరీతో పాటు మరో రూ.40 లక్షలు కంపెనీ ఈక్విటీ కింద ఇస్తారు. వారంలో ఐదు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సి ఉంటుంది. టైమింగ్స్ విషయంలో కొంత స్వేచ్ఛ ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి కాలేజీ డిగ్రీ అవసరం లేదు. రెజ్యూమే కూడా అవసరం లేదు.

అభ్యర్థులు తమ గురించి వివరిస్తూ 100 పదాల పారా రాస్తే సరిపోతుంది. దీనితో పాటు అభ్యర్థులు తమ బెస్ట్ ప్రాజెక్టును పేర్కొనాల్సి ఉంటుంది. Next.js, Python, React.js లో నైపుణ్యం ఉండాలి. కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇది డెవలపర్ జాబ్ అని మేనేజీరియల్ పొజిషన్ అస్సలు కాదని కూడా సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు.


ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సంస్థ అనుసరిస్తున్న కొత్త నియామక విధానాన్ని అనేక మంది ప్రశంసించారు. అయితే, ఐదు సంవత్సరాల పని అనుభవం అర్హతపై మాత్రం కొందరు పెదవి విరిచారు. కర్సర్ లాంటి వాటిని ఇంతకంటే తక్కువ అనుభవం ఉన్న డెవలపర్‌లు అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరీ ఐదు సంవత్సరాల పని అనుభవం ఆశిస్తే సహజసిద్ధమైన ప్రతిభ ఉన్నవారిలో కొందరు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతారని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే నియామకాలన్నీ ఇలాంటి ప్రాతిపదికనే ఉంటాయని జోస్యం చెప్పారు. ఇక, స్మాలెస్ట్ ఏఐ గతంలో కూడా ఇలాంటి జాబ్ ఆఫర్‌తో సంచలనం సృష్టించింది. జూనియర్ డెవలపర్ పోస్టుకు రూ.40 లక్షల వార్షిక శాలరీ ఆఫర్ చేసి కలకలం సృష్టించింది. స్టార్టప్ సంస్థల్లో మారుతున్న ధోరణికి ఇది సూచకమని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


ఇవీ చదవండి:

మన జీవితాలు ఇక మారవేమో.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో

ఈ కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా వైరల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Read Latest and Viral News

Updated Date - Jul 12 , 2025 | 01:32 PM