ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Top Secret: చనిపోయే ముందు శరీరంలో మొదట ఆగిపోయే అవయవం ఏదంటే..

ABN, Publish Date - Mar 27 , 2025 | 08:06 PM

Top Secret: మనిషి చనిపోయే ముందు ఏ అవయవం ఆగిపోతుందో తెలుసా. ఈ విషయం చాలా మందికి తెలియదు. కానీ గుండె అని అంతా అనుకుంటారు. కానీ కాదు. మనిషి చనిపోయిన కొన్ని అవయవాలు కొంత సేపు పని చేస్తాయి. కానీ ఓ అవయవం ఆగి పోతే మాత్రం ఇక మనిషి మరణించినట్లే. అదేమిటంటే..

సృష్టిలో ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. అయితే మనిషి చనిపోయే సమయంలో శరీరంలోని అవయవాలు క్రమంగా పనిచేయడం మానేస్తాయి. కానీ చనిపోయే ముందు.. ముందుగా పనిచేయకుండా ఆగిపోయే భాగం ఏది అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి వైద్య శాస్త్రం స్పష్టమైన సమాధానం ఇస్తుంది. అది మెదడు. శరీరంలో అన్ని వ్యవస్థలను నియంత్రించే కేంద్రం మెదడు. దీని పని తీరు ఆగిపోవడమే మనిషి మరణానికి ప్రాథమిక సంకేతంగా పరిగణింపబడుతుంది.

మరణం సంభవించే క్రమంలో.. మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతే.. అది కొన్ని సెకన్లలోనే పని చేయడం మానివేస్తుంది. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. గుండె ఆగిపోతే లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోతే, రక్త ప్రసరణ ఆగి.. మెదడుకు ఆక్సిజన్ అందక 4 నుంచి 6 నిమిషాల్లో బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది. వైద్య నిపుణుల భాషలో చెప్పాలంటే మాత్రం బ్రెయిన్‌స్టెమ్ మొదట ఆగిపోతుంది, ఇది శ్వాస, గుండె చప్పుడు వంటి ప్రాథమిక విధులను నియంత్రిస్తుంది.


మెదడు ఆగిన అనంతరం కొన్ని సెకన్లు లేదా నిమిషాల పాటు గుండె కొట్టుకొనే అవకాశముంది. కానీ అది స్వతంత్రంగా కాదు.. మెదడు సిగ్నల్స్ లేకుండా అది ఆగిపోతుంది. శ్వాసకోశ వ్యవస్థ కూడా మెదడు నియంత్రణలో ఉంటుంది. కాబట్టి, శ్వాస ఆగడం కూడా మెదడు వైఫల్యం తర్వాతే జరుగుతుంది. మెదడుకు ఆక్సిజన్ లేకుంటే 10 సెకన్లలో స్పృహ కోల్పోతాం. ఒకటి నుంచి రెండు నిమిషాల్లో శాశ్వత నష్టం జరుగుతుందని ఓ అధ్యయనంలో తెలింది. ఇతర అవయవాలు కాలేయం, కిడ్నీలు కొన్ని గంటల వరకు పని చేయవచ్చు. కానీ మెదడు ఆగిన తర్వాత వాటి పని తీరు అర్థరహితమవుతుంది.


కొన్ని సందర్భాల్లో.. క్లినికల్ డెత్ (గుండె, శ్వాస ఆగడం) కంటే బ్రెయిన్ డెత్‌నే మరణించినట్లుగా నిర్ధారిస్తారు. భారత్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ -1994 ప్రకారం.. బ్రెయిన్ డెత్‌ను చట్టపరమైన మరణంగా గుర్తిస్తారు, ఇది అవయవ దానం కోసం కీలకంగా పరిగణిస్తారు. మెదడు ఆగడం వల్ల శరీరం జీవించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. తద్వారా ఇతర అవయవాలు కొంత సమయం పని చేసినా.. అవి స్వతంత్రంగా పని చేయవు. అయితే మెదడు మొదట ఆగడం వల్లే మరణం ఖాయమవుతుందని వైద్య శాస్త్రం స్పష్టం చేస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Iftar Party: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై

Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..

Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి

Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్

LRS : ఎల్ఎస్ఆర్‌ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..

ఈ పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..?

Updated Date - Mar 27 , 2025 | 08:07 PM