ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pregnant Wife: భార్య గర్భిణిగా ఉందని.. కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలేశాడు.. కారణం తెలిస్తే..

ABN, Publish Date - Aug 12 , 2025 | 03:59 PM

ఓ వ్యక్తికి ఇటీవల లో ప్రముఖ కంపెనీలో రూ.1.2 కోట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే రెండు నెలల క్రితం అతడి భార్య గర్భవతి అని తెలిసింది. దీంతో చివరకు ఆ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ భర్తను ప్రస్తుతం అంతా ప్రసంశలతో ముంచెతున్నారు.

భార్య గర్భవతి అని తెలియగానే.. ‘తండ్రిని కాబోతున్నానోచ్’.. అంటూ ఎగిరి గంతేసే భర్తలను చూశాం. భార్యకు అడిగింది కొనిపెట్టే భర్తలను కూడా చూసుంటాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ భర్త చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. భార్య కడుపుతో ఉందని తెలిసి.. కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడో భర్త. ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి ఇటీవల బెంగళూరులోని (Bangalore) జయనగర్‌లో ప్రముఖ కంపెనీలో రూ.1.2 కోట్ల జీతంతో ఉద్యోగం వచ్చింది. అయితే రెండు నెలల క్రితం అతడి భార్య గర్భవతి (Pregnant wife) అని తెలిసింది. దీంతో భర్తతో పాటూ కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించారు. భార్య గర్భిణి అని తెలియగానే.. ఆమె చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, విశ్రాంతి తీసుకోవాలని భర్త సూచించాడు.

అయితే ఆమె ఇందుకు అంగీకరించలేదు. ఇంటి వద్ద నుంచే పని చేయాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అయితే భార్యకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో.. చివరకు ఆ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కోట్ల రూపాయల జీతం వచ్చే తన (Husband Resigned His Job) ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంటి వద్దే ఉంటూ భార్యకు వండిపెట్టడం దగ్గర నుంచి, ఇంటి పనులన్నీ తానే చూసుకుంటున్నాడు. భర్త చేసిన పని భార్యకు ఇష్టం లేకపోయినా.. చివరకు అంగీకరించాల్సి వచ్చింది. భార్య సంక్షేమం కోసం ఈ భర్త తీసుకున్న నిర్ణయంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆ భర్త ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ.. ‘కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని మళ్లీ సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ నా భార్యను సంతోషంగా చూసుకునే ఇలాంటి సమయం మళ్లీ రాదు’.. అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘భార్యను చూసుకోవడం కోసం కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం అమాయకత్వం’.. అంటూ కొందరు, ‘సామాన్యులు ఇలా చేయడం సాధ్యం కాదు’.. అంటూ మరికొందరు, ‘భార్య కోసం ఈ భర్త చేసిన పనికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 04:33 PM