ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

UK Mom Shocked by Newborn: ఈ తరం తల్లులు ఇలా అయిపోతున్నారేంటో.. అప్పుడే పుట్టిన బిడ్డను చూసి షాక్

ABN, Publish Date - Apr 24 , 2025 | 10:48 AM

అప్పుడే పుట్టిన బిడ్డను చూసి చీదరించుకున్న ఓ తల్లి వలవలా కన్నీరు కార్చేసింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

UK Mom Newborn Reaction

ఇంటర్నెట్ డెస్క్: తల్లుల దృష్టిలో కడుపున పుట్టిన బిడ్డలకు మించిన వారు ప్రపంచంలో మరెక్కడా ఉండరు. అందంలో, తెలివిలో తమ పిల్లలే టాప్ అని తల్లులు భావిస్తారు. బిడ్డలను చూసుకుని మురిసిపోతారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ యువతి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా స్పందించింది. పుట్టిన బిడ్డను చూడగానే చీదరించుకున్న ఆమె చిన్నారిని కనీసం పొత్తిళ్లల్లోకి కూడా తీసుకోలేదు. ప్రస్తుతం నెట్టింట ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఇంతకంటే క్రూరమైన విషయం మరొకటి ఉంటుందా అని జనాల నోరెళ్లబెట్టేలా చేస్తోంది.


పూర్తి వివరాల్లోకి వెళితే, యూకేకు చెందిన జెస్ కొన్ని గంటల పాటు ప్రసవ వేదన అనుభవించి బిడ్డను కన్నది. కానీ ఆ శిశువును చూడగానే ఆమె తీవ్ర షాక్‌కు గురైంది. చిన్నారి అసలేమాత్రం బాలేడంటూ కనీసం దగ్గరకు కూడా తీసుకోలేకపోయింది. తన బిడ్డగా స్వీకరించేందుకు కొంత సేపు నిరాకరించింది. చిన్నారి ముక్కు, స్థూలంగా అతడి ఆకారం అసలేం బాలేదని తీర్మానించుకుంది. ఆ బాధ తట్టుకోలేక కాసేపు వలవలా ఏడ్చేసింది. కొన్ని గంటల తరువాత తేరుకున్నాక బిడ్డను దగ్గరకు తీసుకుంది. బిడ్డ బానే ఉన్నాడనే నిర్ధారణకు రాగలిగింది. ఈ ఉదంతాన్ని జెస్ స్వయంగ నెట్టింట పంచుకోగా జనాలు పెద్ద ఎత్తున స్పందించారు.


జెస్‌ను అనేక మంది తీవ్రంగా విమర్శించారు. నీ బిడ్డను నువ్వే ఛీదరించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇది నిజంగా క్రూరమై చర్య అని అన్నారు. తను పుట్టిన వెంటనే తల్లి ఛీదరించుకుందని తెలిస్తే పెద్దయ్యాక ఆ బిడ్డ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బాలుడి భవిష్యత్తుపై విచారం వ్యక్తం చేశారు. అయితే, బిడ్డను చూశాక తన మానసిక స్థితిపై జెస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రసవం తరువాత తలెత్తిన హార్మోన్ల అసమతౌల్యత కారణంగా తాను అలా ప్రవర్తించి ఉండొచ్చని చెప్పింది. ప్రస్తుతం బిడ్డ తనకు అందంగానే కనిపిస్తున్నాడని అన్నది. అయితే, ఘటనపై మాత్రం చర్చ ఇంకా సద్దుమణగట్లేదు.

ఇవి కూడా చదవండి:

పరీక్షల్లో కాపీ కొట్టేందుకు హెల్ప్ చేసే ఏఐ.. ఇలాంటి ఎక్కడా చూసుండరు

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

Read Latest and Viral News

Updated Date - Apr 24 , 2025 | 10:51 AM