Share News

AI Startup Cluely: పరీక్షల్లో కాపీ కొట్టేందుకు హెల్ప్ చేసే ఏఐ.. ఇలాంటి ఎక్కడా చూసుండరు

ABN , Publish Date - Apr 24 , 2025 | 07:15 AM

ఇంటర్ల్యూల్లో, పరీక్షల్లో చీట్ చేసేందుకు ఉపయోగించే ఓ ఏఐ యాప్‌ జనాలను ప్రస్తుతం బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ యాప్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీకి తాజాగా 5.3 మిలియన్ డాలర్ల నిధులు అందాయి.

AI Startup Cluely: పరీక్షల్లో కాపీ కొట్టేందుకు హెల్ప్ చేసే ఏఐ.. ఇలాంటి ఎక్కడా చూసుండరు
AI Startup Cluely

ఇంటర్నెట్ డెస్క్: పరీక్షల్లో కాపీ అంటే కట్టుతప్పడమే.. నైతికతను కోల్పోవడమే. సామర్థ్యాలకు పదును పెట్టుకునే అవకాశాన్ని కోల్పోవడమే.. కానీ ఇవేవీ పట్టించుకోని ఓ స్టార్టప్ సంస్థ.. పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో అభ్యర్థులకు సాయపడేందుకు ఓ కొత్త ఏఏఐని రూపొందించింది. దీన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు సందరు సంస్థకు ఏకంగా 5.3 మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్ కూడా దక్కింది. కొలంబియా యూనివర్సిటీలో చదువుకు మధ్యలోనే గుడ్ బై చెప్పిన ఇద్దరు యువకులు ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు.

ఈ ఏఐ టూల్ పేర్లు క్లూలీ.. దీన్ని బ్రౌజర్‌లో ఎవరి కంటా పడకుండా ఓపెన్ చేయొచ్చు. బ్రౌజర్‌లో మనం చేసే పనులన్నిటినీ ఇది జాగ్రత్తగా గమనిస్తూ సలహాలిస్తుంది. దీంతో, పరీక్షలు మొదలు ఇంటర్వ్యూల వరకూ ఏదైనా సులువుగా గట్టెక్కొచ్చు. దీన్ని చున్‌గిన్ రాయ్ లీ అన వ్యక్తి తొలిసారి డిజైన్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు టెక్నికల్ ఇంటర్వ్యూలో సహాయకారిగా ఉండేందుకు రూపొందించారు. ఇలాంటి ప్రాజెక్టు డిజైన్ చేసినందుకు కొలంబియా యూనివర్సిటీ అతడిని తొలగించింది. ఆ తరువాత నీల్ షన్‌ముగమ్ అనే యువకుడితో దీన్ని మరింతగా అభివృద్ధి చేసి క్లూలీని రెడీ చేశారు.


అయితే, క్లూలీని వినియోగించడం అనైతికం కాదని సంస్థ సమర్థించుకుంటోంది. కాలిక్యులేటర్లు, స్పెల్ చెక్‌ల వినియోగాన్ని కూడా మొదట మోసం చేయడంగానే భావించారని, ఆ తరువాత ఇవి సాధారణమైపోయాయని తెలిపింది. ఈ టూల్ ప్రచార వీడియోలో లీ.. ఆన్‌లైన్ డేటింగ్‌ సందర్భంగా అవతలి వ్యక్తితో అసత్యాలు పలికాడు. ఇందుకు క్లూలీ సాయం తీసుకున్నాడు. క్లూలీ వినియోగంపై ఇంత కాంట్రవర్సీ నడుస్తు్న్నా పెట్టుబడిదారులను మాత్రం ఆకట్టుకోగలిగింది. సంస్థకు ఆదాయం ఏడాది 3 మిలియన్ డాలర్లకు చేరింది.


మరోవైపు ఈ ఏఐ యాప్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో జనాల చర్చ నైతికత మీదకు మళ్లింది. దీన్ని వినియోగించే వారికి ఇంటర్వ్యూల్లో, పరీక్షల్లో అదనపు ప్రయోజనాలు చేకూరితే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆధునిక ఏఐ వినియోగంపై ఈ యాప్ ఓ సెటైర్ అని కూడా కొందరు వ్యాఖ్యానించారు. దీని వల్ల అనైతికత పెరుగుతుందని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. టాప్ కంపెనీలు వినియోగించే లీట్ కోడ్ ఇంటర్వ్యూ విధానంలో లోపాలు ఎత్తి చూపేందుకు తాను దీన్ని అభివృద్ధి చేశానని లీ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..

అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు

వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..

Read Latest and Viral News

Updated Date - Apr 24 , 2025 | 07:16 AM