ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bride And Groom Viral Videos: టీవీఎస్‌పై వెళ్తున్న వధూవరులు.. ముందు వైపు చూడగా అవాక్కయ్యే సీన్.. వరుడి ప్లానింగ్ చూస్తే..

ABN, Publish Date - Jun 15 , 2025 | 08:09 AM

వరుడు టీవీఎస్ వాహనంపై వధువును కూర్చోబెట్టుకుని రయ్యిన దూసుకెళ్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను వాహనంపై వధువును ఎక్కించుకుని వెళ్లడంలో ఎలాంటి విశేషం లేకున్నా.. వెళ్లే సమయంలో..

వధూవరులు అంటే మొన్నటి వరకూ తలంబ్రాలు చల్లుకోవడం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం.. వంటి సీన్లే గుర్తుకొచ్చేవి. కానీ ప్రస్తుతం హీరో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా వివిధ రకాల విన్యాసాలు చేయడం, వినూత్న వాహనాలపై ఎంట్రీ ఇవ్వడం, సినిమా తరహాలో డాన్సులు చేయడంతో పాటూ విచిత్రంగా ఫోజులు ఇవ్వడం సర్వసాధారణమైంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక వివాహాలను చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కొత్త జంటకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. టీవీఎస్ వాహనంపై వెళ్తున్న వధూవరులను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వరుడి ప్లానింగ్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వరుడు టీవీఎస్ వాహనంపై వధువును కూర్చోబెట్టుకుని (Bride and groom on TVS vehicle) రయ్యిన దూసుకెళ్తున్నాడు. ఇందులో అవాక్కవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. అతను వాహనంపై వధువును ఎక్కించుకుని వెళ్లడంలో ఎలాంటి విశేషం లేకున్నా.. వెళ్లే సమయంలో ఎండ తగలకుండా అతను తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా అవాక్కవుతున్నారు.

ఎండ వేడి తగలకుండా టీవీఎస్ వాహనం ముందు వైపు ఏకంగా (Cooler installed at front of the TVS vehicle) మినీ కూలర్‌ను ఏర్పాటు చేశాడు. హ్యాండిల్‌కు ముందు వైపు తాళ్లతో బిగించి కట్టడం వల్ల.. అందులో నుంచి వచ్చే చల్లని గాలితో వాహనంపై ఉన్న వారికి ఉపశమనం కలుగుతోంది. ఇలా ఈ వరుడు విచిత్రంగా ఆలోచించి, ఎండ వేడి తగలకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇతడి విచిత్రమైన తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ వరుడి తెలివితేటలు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 85 వేలకు పైగా లైక్‌లు, 5.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 08:09 AM