Marriage Funny Video: అరెరే.. అనవసరంగా వరుడికి తిక్క రేపాడుగా.. సడన్‌గా బుగ్గ గిల్లేయడంతో.. చివరకు..
ABN, Publish Date - May 21 , 2025 | 07:09 PM
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. వధూవరులు వేదికపై కూర్చుని ఉండగా.. అతిథులంతా వరుసగా పైకి వచ్చి వారితో ఫొటోలు దిగుతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి పైకి వచ్చి వరుడితో ఫొటో దిగే క్రమంలో గట్టిగా బుగ్గ గిల్లేస్తాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్లాన్ చేసి చేస్తారో లేక అనుకోకుండా జరుగుతుందో తెలీదు గానీ.. వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి వివాహం ముగిసేలోపు ఏదో ఒక వింత ఘటన చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని ఘటనలు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వేదికపై కూర్చున్న వరుడికి అనవసరంగా కోపం తెప్పించాడు. వధువు పక్కన ఉండగానే అతడి బుగ్గ గిల్లేయడంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. వధూవరులు (Bride and groom) వేదికపై కూర్చుని ఉండగా.. అతిథులంతా వరుసగా పైకి వచ్చి వారితో ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పైకి వచ్చి వరుడి కుర్చీ వెనుక నిలబడతాడు. వరుడి చేతికి గిఫ్ట్ ఇచ్చి ఫొటో దిగేందుకు ఫోజు ఇస్తాడు.
Viral Video: నిప్పు లేకుండానే టీ చేసేశారు.. వీళ్ల ప్రయోగం చూస్తే అవాక్కవుతారు..
అయితే ఈ క్రమంలో వరుడి బుగ్గలు పట్టుకుని గట్టిగా గిల్లుతాడు. దీంతో వరుడికి చుక్కలు కనిపిస్తాయి. షాక్ నుంచి తేరుకున్న వరుడు.. చేతులు వెనక్కు పెట్టి మరీ అతన్ని కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత కుర్చీ నుంచి పైకి లేచి, (Groom attacked relative) అతడిపై పిడిగుద్దులు కురిపిస్తాడు. దీంతో ఆ వ్యక్తి కూడా షాక్ అవుతాడు. వరుడు ఇలా ఆగ్రహానికి గురవడం చూసి వధువు కూడా అవాక్కై.. పైకి లేచి అతడికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది.
ఇంతలో అక్కడున్న వారంతా అక్కడికి చేరుకుని వరుడిని శాంతింపజేస్తారు. ఇదంతా వ్యూస్ కోసం కావాలని చేశారో.. లేక అనుకోకుండా జరిగిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. అనసరంగా వరుడికి కోపం తెప్పించాడే’’.. అంటూ కొందరు, ‘‘వరుడు సరైన పని చేశాడు..’’.. అంట మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 వేలకు పైగా లైక్‌లు, 1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 21 , 2025 | 07:30 PM