ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dark Tourism: డార్క్ టూరిజం అంటే ఏంటి.. యువతలో పెరుగుతున్న కొత్త ట్రెండ్..

ABN, Publish Date - Apr 11 , 2025 | 08:10 PM

Gen Z Dark Tourism: టూరిజం అంటే ఎప్పుడూ కొత్త ప్రదేశాలు చూడటం, కొత్తవాళ్లను కలవడం, కొత్త రుచులు ఆస్వాదించడం అనుకుంటాం. కానీ ఇప్పటి యువత ముఖ్యంగా Gen Z టూరిజాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు. యువత క్రేజీగా ఫీలవుతున్న కొత్త ట్రెండ్‌ పేరే.. డార్క్ టూరిజం. ఇది వినగానే కొంచెం భయంగా అనిపించవచ్చు.. అసలు ఏంటి వింత టూరిజం.. దీని స్పెషాలిటీ ఏంటి..

Gen Z Dark Tourism

Why Gen Z Crazy About Dark Tourism: అందరూ సరదాగా గడపడానికి కొత్తగా, అందంగా ఉండే ప్రాంతాలకు వెళతారు. డార్క్ టూరిజం మాత్రం అందుకు భిన్నం. ఇందుకు చాలా గట్స్ ఉండాలి. ఇదొక రకమైన శోధన లాంటిది. చీకటి చరిత్రలు, మరిచిపోయిన హృదయవేదనల గుర్తులు, భయానక మూడ్‌లతో నిండి ఉండే ప్రదేశాల్ని సందర్శించడమే డార్క్ టూరిజం. ఈ ప్రయాణాల్లో మామూలుగా మనం చూసే కట్టడాలు, పర్యాటక కేంద్రాలు ఉండవు. ఇవి రక్తపు మరకల్ని, కన్నీటి కథల్ని చెబుతాయి. కానీ ఆ కథల్లోనే నిజమైన హిస్టరీ దాగి ఉంటుంది. పాఠ్యపుస్తకాల్లో లేని నిజాలివి. ఆ నిజాల పైనే Gen Z దృష్టి పెట్టింది.


  • జలియన్‌వాలా బాగ్ - అమృత్‌సర్

    ఈ నేల రక్తాన్ని మింగింది. అమాయకుల్ని దారుణంగా బలితీసుకున్న చారిత్రక దురాఘాతాలకు ఇదొక సాక్ష్యం. ఈ ప్రదేశానికి వెళ్లినవాళ్లకు ఆ కాలం కళ్ల ముందే కనపడుతుంది. నిశ్శబ్దం భయపెడుతుంది. కానీ ఆ భయమే నిజాన్ని మాట్లాడుతుంది.

  • సెల్యూలర్ జైలు - పోర్ట్ బ్లేర్

    కాలాపానీ జైలు అనగానే ఒళ్ళు గగుర్పొడుస్తుంది చరిత్ర తెలిసినవాళ్లకు. బ్రిటిష్‌ శాసనానికి ఎదిరించిన నిస్సహాయుల ఆక్రందనలు ఇప్పటికీ గోడల మధ్య నలుగుతాయంటే నమ్మండి. అక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికీ ఒకింత వేదన, ఒకింత గర్వం కలుగుతుంది.


  • విక్టోరియా మెమోరియల్ - కోల్‌కతా

    అద్భుతమైన నిర్మాణం... కానీ అందులో బాధితుల ఘోషలు దాగి ఉన్నాయి. బ్రిటిష్‌ పాలనలో భారతీయుల వేదనను గుర్తు చేసే అనుభవాలకు ఈ గోడలు సాక్ష్యంగా నిలిచాయి.

  • కుల్ధారా - జైసల్మేర్

    ఒక రాత్రిలో అంతా మాయం అయ్యింది. కుల్ధారా ఊరంతా ఖాళీ అయ్యింది. ఎవరూ తిరిగి రాలేదు. ఎందుకు వెళ్లిపోయారో ఎవరికి తెలియదు. అక్కడ అడుగు పెట్టగానే అసహజ నిశ్శబ్దం మనల్ని వెనక్కి లాగుతుంటుంది.


  • రూప్కండ్ సరస్సు - ఉత్తరాఖండ్

    ఎంతో ఎత్తులో ఉన్న ఈ సరస్సు నీటిలో శవాలే కనిపిస్తాయి. ఎందుకు అక్కడ తలకిందులయ్యారో.. ఎవరు వాళ్లు అనేది ఇప్పటికీ ప్రశ్నే. మనిషికి మిగిలిపోయే చివరి గుర్తులే ఆ ఎముకలు.

  • డుమాస్ బీచ్ - సూరత్

    కృష్ణవర్ణపు ఇసుక, నిశ్శబ్దం నిండిన అలలు... కానీ కొందరికి అక్కడ అడుగుల సవ్వడి వినిపిస్తుంది. ఎవరూ లేని చోట మాట్లాడుతున్న గళాలు వినిపిస్తాయి. ఇది బీచ్ కాదు. ఓ మిస్టరీ.


  • శనివారం వాడా - పుణె

    గడియారాలు ఆగిన గదులు, గోడల మధ్య ఇంకా నారాయణరావు పేష్వా అరుపులు వినిపిస్తాయంటే ఈ ప్రదేశంలో ఏదో మాట ఉంది. ఇది కేవలం కోట కాదు. ఓ ఆత్మ ఘోష.

ఇవన్నీ కేవలం టూరిస్ట్ స్పాట్‌లు కావు. ఇవి చరిత్రలో మనిషి అనుభవించిన చీకటి కోణాల కథలు. Gen Z ఈ కథల్ని వినాలనుకుంటున్నారు. తెలుసుకోవాలనుకుంటున్నారు. సోషల్ మీడియా లో రీల్‌లు, షార్ట్ వీడియోలు చూసి ఈ ప్లేసులపై ఆసక్తి పెరిగిపోతోంది. భయం, హిస్టరీ, మిస్టరీ లాంటివి కలిసిన ప్రయాణమే డార్క్ టూరిజం. ఇది భయపెట్టే టూర్ కాదు... మనల్ని మనల్ని తెలుసుకునే టూర్.


Read Also: Optical Illusion: ఈ ఫొటోలో మూడో పిల్లిని 5 సెకెన్లలో కనిపెడితే.. మీకు దృష్టి లోపం లేనట్టే

Trisha: ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన త్రిష.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్..

Britisher Impressed by Food Delivery: భారతీయ రైల్లో అద్భుత అనుభవం.. మురిసిపోయిన బ్రిటీషర్

Updated Date - Apr 11 , 2025 | 08:11 PM