Woman Funny Video: ఈమెకు అలా అర్థమైందా.. సిగ్నల్స్ వద్ద ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN, Publish Date - Mar 09 , 2025 | 06:12 PM
స్కూటీపై వెళ్తున్న ఓ యువతి సిగ్నల్ వద్ద ఆగింది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. సిగ్నల్ వద్ద ఈ యువతి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరే చూడండి..
కొందరు మహిళలు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మరికొందరు తెలిసీ తెలీక చేసే పనులు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి స్కూటీపై వెళ్తూ సిగ్నల్ వద్ద స్కూటీ ఆపిన ఆపిన ఆమె చివరకు చేసిన నిర్వాకం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమెకు అలా అర్థమైందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. స్కూటీపై వెళ్తున్న ఓ యువతి (young woman) సిగ్నల్ వద్ద ఆగింది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. సాధారణంగా రెడ్ సిగ్నల్ పడితే వాహనాలు ఆగిపోతుంటాయి.
Facial Viral Video: ఇలాంటి ఫేసియల్ చేయించుకోవాలంటే గట్స్ ఉండాలేమో.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
అయితే ఇక్కడ ఈమె గ్రీన్ సిగ్నల్ పడడం చూసి వాహనం ఆపింది. అలా కొద్దిసేపటి తర్వాత రెడ్ సిగ్నల్ పడగానే ముందుకు కదిలింది. చూస్తే చదువుకున్న యువతిలాగా కనిపిస్తున్నా కూడా.. ఇలా సిగ్నల్‌పై (Signals) కనీస అవగాహన లేకుండా వ్యవహరించడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఒకవేళ ప్రదాన రహదారుల్లో ఇలా చేస్తే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.
Dog Attack Video: వామ్మో యువతిని చుట్టుముట్టిన కుక్కలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెకు సిగ్రల్స్ ఇలా అర్థమయ్యాయా’’.. అంటూ కొందరు, ‘‘ఈమెను అర్జంటుగా డ్రైవింగ్ స్కూల్లో చేర్పించాలి’’.. అంటూ మరికొందరు , వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 95 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video:రాత్రి వేళ బస్సులో వ్యక్తి అసభ్య నిర్వాకం.. పక్క సీటులోని వ్యక్తి కెమెరా ఆన్ చేయగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Updated Date - Mar 09 , 2025 | 06:12 PM