Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:59 PM
ఓ మహిళ తన ఇంటి ముందు చీపురుతో శుభ్రం చేస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా బకెట్‌తో నీళ్లు పట్టుకుని.. ఓ చేత్తో నీళ్లు చల్లుతూ మరో చేత్తో చీపురుతో శుభ్రం చేస్తుంటారు. అయితే ఈమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు..

కొందరు చిన్న చిన్న పనులను కూడా ఎంతో కష్టపడి చేస్తుంటారు. మరికొందరు పెద్ద పెద్ద పనులను సైతం ఎంతో సులభంగా చేసేస్తుంటారు. మరికొందరు రోజు వారీ పనులను సింపుల్ ట్రిక్స్‌తో చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. చాలా మంది మహిళలు ఇంటి పనులను విభిన్నంగా చేయడం చూస్తుంటాం. కొందరు సైకిల్ చక్రాన్ని వాషింగ్ మిషిన్‌లా వాడి దుస్తులను ఉతికితే.. మరికొందరు మహిళలు ఏకంగా ఇటుకలతో వాషింగ్‌మెషిన్‌ను నిర్మిస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కష్టపడి చేయాల్సిన పనిని ఓ మహిళ ఎంతో సింపుల్‌గా చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman cleaning with broom) తన ఇంటి ముందు చీపురుతో శుభ్రం చేస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా బకెట్‌తో నీళ్లు పట్టుకుని.. ఓ చేత్తో నీళ్లు చల్లుతూ మరో చేత్తో చీపురుతో శుభ్రం చేస్తుంటారు.
Woman Viral Reel Video: వంట చేస్తూ రీల్ చేయాలనుకుంది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
అయితే ఈమె మాత్రం తన బుర్రకు పని పెట్టి ఇదే పనిని ఎంతో సింపుల్‌గా చేసేసింది. నీళ్ల పైపును (Water pipe) తన కాలికి, చెప్పునకు మధ్యలో పెట్టుకుంది. తర్వాత తాను ముందుకు కదులుతూ మరో చేత్తో చీపురుతో శుభ్రం చేసింది. ఇలా రెండు పనులు ఒకే సమయంలో ఎంతో సులభంగా చేసేసిందన్నమాట.
Woman Funny Video: ఫోన్ పిచ్చిలో పడితే ఇంతే.. రోడ్డుపై ఈమె చేసిన ఘనకార్యం చూస్తే ఖంగుతింటారు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్మార్ట్ వర్క్ అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘వావ్.. ఈమె ఐడియా అద్భుతంగా ఉందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Elephant Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసింది.. ఈ మొసలి పరిస్థితి చివరకు ఏమైందంటే..
ఇవి కూడా చదవండి..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..