Fish Viral Video: భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో.. మొసలి నోటి దాకా వెళ్లిన చేప.. ఎలా బయటపడిందో చూస్తే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 09:44 PM
చాలా మొసళ్లు నీటి ఒడ్డున గుంపులు గుంపులుగా పడుకుని ఉంటాయి. అక్కడే ఓ చేప గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అయితే వాటిలో ఓ మొసలి చేపను తినేందుకు ప్రయత్నించింది. అయితే తీరా నోటితో పట్టుకునే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదాల నుంచి బయటపడిన సందర్భాల్లో ‘‘వీడికి భూమ్మీద నూకలున్నాయిరా’’.. అని అంటూ ఉంటాం. ఇలాంటి అనుభవాలు మనుషులకే కాదు.. పక్షులు, జంతువుల విషయంలోనూ జరుగుతుంటుంది. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చేప వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొసలి నోటిదాకా వెళ్లిన చేప.. అనుకోని విధంగా ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఈ చేప అదృష్టం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మొసళ్లు నీటి ఒడ్డున గుంపులు గుంపులుగా పడుకుని ఉంటాయి. అక్కడే ఓ చేప గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ పక్కనే ఓ మొసలి పడుకుని ఉంటుంది. ఆ చేప ఎగిరి ఎగిరి పడుతున్నా కూడా ఆ మొసలి తినకుండా సైలెంట్‌గా ఉంటుంది.
Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న ఎలుకను 20 సెకన్లలో కనుక్కుంటే.. మీకు దృష్టి లోపం లేనట్లే..
ఇంతలో చేపను గమనించిన మరో మొసలి దగ్గరికి వచ్చి (Crocodile trying to eat fish) తినేందుకు ప్రయత్నిస్తుంది. అయితే తీరా దగ్గరికి వచ్చే క్రమంలో దాని కింద ఉన్న మొసలి నీళ్లలోకి దూసుకెళ్తుంది. దీంతో పైన ఉన్న మొసలి కూడా దాంతో పాటూ నీళ్లలోకి వెళ్లిపోతుంది. ఇలా అక్కడున్న మొసళ్లన్నీ నీళ్లలోకి వెళ్లిపోవడంతో ఆ చేప ప్రాణాలతో బయటపడుతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
Marriage Funny Video: ఈ వరుడు మరీ చిలిపి సుమీ.. వధువు సోదరికి ఎలా షాక్ ఇచ్చాడో చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అదృష్టం బాగుంటే ఇలాగే అద్భుతాలు జరుగుంటాయి’’.. అంటూ కొందరు, ‘‘ఈ చేప ఎంతో లక్కీలా ఉందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26 వేలకు పైగా లైక్‌లు, 7.5 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..