Dog Attack Video: వామ్మో యువతిని చుట్టుముట్టిన కుక్కలు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:27 PM
ఓ యువతి నడుస్తూ వెళ్తుండగా మధ్యలో కుక్కల గుంపు కనిపించింది. వాటిని దాటుకుని కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఇటీవల కుక్కల దాడి ఘటనలు మరింత పెగిగిపోతున్న విషయం తెలిసిందే. రోడ్డుపై చిన్నారులతో పాటూ పెద్దవారిని కూడా వీధి కుక్కలు దాడి చేస్తున్న సందర్భాలను చూస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలను కూడా చూస్తున్నాం. కుక్కల దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతిని వీధి కుక్కలన్నీ చుట్టుముట్టాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని (Rajasthan) ఆల్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక జేకే నగర్‌లో ఓ యువతి నడుస్తూ వెళ్తుండగా మధ్యలో కుక్కల గుంపు కనిపించింది. వాటిని దాటుకుని కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Puzzle:ఈ రెండు చిత్రాల్లో దాగి ఉన్న 5 తేడాలను కనుక్కుంటే.. మీ కంటి చూపునకు తిరుగులేనట్లే..
కుక్కలన్నీ ఆమెను వెంబడించాయి. కుక్కలు తన మీదకు రావడం చూసి అమె భయంతో పరుగెత్తింది. అయినా కుక్కలు ఆమెను వదలకుండా (Dog attack on young woman) వెంటబడి మరీ చుట్టుముట్టి దాడి చేశాయి. ఇంతలో స్కూటీపై అటుగా వచ్చిన ఓ మహిళ.. బండి ఆపి తన చేతిలో క్యారేజీ బాక్సుతో కుక్కలను తరిమికొట్టింది. దీంతో పెద్ద ప్రమాదం నుంచి యువతి బయటపడింది. ఇంతలో యువతి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సమయానికి ఆ మహిళ స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Tricks Viral Video:కుళాయికి పైపు తగిలించడం ఇంత ఈజీనా.. ఈ ట్రిక్ ఏదో అదిరిందిగా..
ఈ ఘటనలో యువతి శరీరంపై ఎనిమిది చోట్ల కాట్లు పడ్డట్లు తెలిసింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సమయానికి మహిళ స్పందించడం గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video:రాత్రి వేళ బస్సులో వ్యక్తి అసభ్య నిర్వాకం.. పక్క సీటులోని వ్యక్తి కెమెరా ఆన్ చేయగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..