ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Funny Viral Video: కాలికున్న చెప్పును మంటల్లో కాల్చారు.. తీక్షణంగా చూడగా దిమ్మతిరిగే ట్విస్ట్..

ABN, Publish Date - Aug 13 , 2025 | 03:44 PM

కాలికి వేసుకున్న చెప్పును నిప్పుల మీద వేడి చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఇదేంటీ చెప్పును వేడి చేస్తున్నారని అవాక్కయ్యారు. అయితే తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది..

కొందరు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మరికొందరు చేసే ప్రయోగాలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరు చేసే ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యంతో పాటూ తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాలికి వేసుకున్న చెప్పులను మంటల్లో కాల్చేశారు. చివరకు చూడగా అంతా అవాక్కయ్యే సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కాలికి వేసుకున్న చెప్పును నిప్పుల మీద వేడి చేయడం చూసి అంతా షాక్ అయ్యారు. ఇదేంటీ చెప్పును వేడి చేస్తున్నారని అవాక్కయ్యారు. అయితే తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. అది చెప్పు కాదు, కాలు కాదు.. వంకాయ అని అర్థమవుతుంది. పెద్ద వంకాయను తీసుకుని, (Making Eggplant in the Shape of Slipper) దాన్ని కాలికి వేసుకున్న చెప్పులాగా కట్ చేస్తూ డిజైన్ చేశారు.

అలాగే దాని చివరన వంకాయ కాండాన్ని కూడా సెట్ చేశారు. ఈ వంకాయను ఫైనల్‌గా చూడగా.. కాలికి చెప్పు వేసుకున్నట్లుగానే ఉంది. తీక్షణంగా గమనిస్తే తప్ప.. అది వంకాయ అన్న విషయం తెలీదు. అలాగే వంకాయతో షూను కూడా డిజైన్ చేశారు. అది కూడా చూసేందుకు అచ్చం నిజమైన షూలాగే ఉంది. ఇలా వంకాయతో వినూత్నమైన ప్రయోగాలు చేసిన ఈ వ్యక్తిని అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరికొందరు ఇదేం ప్రయోగం అంటూ నవ్వుకుంటున్నారు.

మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇలాంటి ప్రయోగం ఎప్పుడూ చూడలేదే’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వంకాయను ఇప్పుడే చూస్తున్నాం’.. అంటూ మరికొందరు, ‘చెప్పును కాల్చి తినడమంటే ఇదే’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌‌లు, 21.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 03:44 PM