ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elderly Widow: వృద్ధురాలిపై మహిళల దాడి.. కాళ్లు పట్టుకుని లాగుతూ..

ABN, Publish Date - Jul 06 , 2025 | 06:52 AM

Elderly Widow: గొడవ మొదలైన కొద్ది సేపటికే అది పెద్దదైంది. ఈ నేపథ్యంలో ఆ మహిళలు రెచ్చిపోయారు. వృద్ధురాలిపై దాడికి దిగారు. ఓ మహిళ వృద్ధురాలి కాళ్లు పట్టుకుని కొంతదూరం చెత్తలోనే లాక్కెళ్లింది.

Elderly Widow

ఉత్తర ప్రదేశ్‌లో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ ఇద్దరు మహిళలు.. వృద్ధురాలిపై దాడికి దిగారు. కొట్టడమే కాకుండా.. ఆమె కాళ్లు పట్టుకుని చెత్తలో ఊడ్చుకెళ్లారు. పట్ట పగలు అందరూ చూస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, షహరాన్‌పూర్‌‌లోని దతౌళీ రంగద్ గ్రామానికి చెందిన ప్రేమో దేవీ అనే వృద్ధురాలికి అదే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ ఎందుకు జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు.

గొడవ మొదలైన కొద్ది సేపటికే అది పెద్దదైంది. ఈ నేపథ్యంలో ఆ మహిళలు రెచ్చిపోయారు. వృద్ధురాలిపై దాడికి దిగారు. ఓ మహిళ వృద్ధురాలి కాళ్లు పట్టుకుని కొంతదూరం చెత్తలోనే లాక్కెళ్లింది. అక్కడ ఉన్న జనం ఎంత వారించినా ఆమె వినలేదు. ఆగ్రహంతో ఊగిపోయింది. బూతులు సైతం తిట్టింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అంటే ఇదేనేమో.. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఎలా లాగుతుందో చూడండి’..‘ఆ ఇద్దరు మహిళలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. కాళ్లు పట్టిలాగుతున్న మహిళను అస్సలు వదిలిపెట్టకూడదు’..‘కలికాలం.. ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమో..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై షహరాన్‌పూర్ పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసుకుంటామని, వృద్ధురాలిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

కోదాడలో బయటపడినవి.. చాళుక్య భీమ నాటి రాగి పలకలు

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

Updated Date - Jul 06 , 2025 | 08:25 AM