Mangalsutra Surprise: వెలుగులోకి కొత్త విషయం.. భార్య మంగళసూత్రం కోసం భిక్షమెత్తి..
ABN, Publish Date - Jun 19 , 2025 | 06:28 PM
Mangalsutra Surprise: డబ్బుల కోసం నెల రోజుల నుంచి భిక్షమెత్తాడు. రూపాయి, రూపాయి పోగు చేశాడు. దాన్నంతా ఓ గుడ్డ సంచిలో వేసుకుని భార్యతో కలిసి షాపుకు వెళ్లాడు. వారిని చూడగానే.. సాయం అడగడానికి వస్తున్నారేమో అని షాపులోని సిబ్బంది భావించారు.
వన్ గ్రామ్ గోల్డ్ షాపులో మంగళసూత్రం కొనడానికి వెళ్లిన వృద్ధ దంపతుల ఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది. 93 ఏళ్ల ఆ పెద్దాయన భార్యకు మంగళసూత్రం కొనివ్వడానికి నెల రోజుల పాటు భిక్షమెత్తాడట. నెల రోజులు భిక్షమెత్తి పోగేసిన డబ్బుతో భార్యను షాపుకు తీసుకెళ్లాడు. అయితే, ఆ పెద్దాయనకు భార్య మీద ఉన్న ప్రేమ గుర్తించిన షాపు యజమాని కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుని మంగళసూత్రాన్ని ఇచ్చేశాడు. అందుకు సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఎవరా వృద్ధ దంపతులు.. అసలేం జరిగింది?..
మహారాష్ట్ర, జల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృత్తి షిండే, శాంతాబాయి భార్యాభర్తలు. షిండే వయసు 93 సంవత్సరాలు.. శాంతాబాయి వయసు 85 పైనే ఉంటుంది. ఇద్దరికీ పెళ్లై 70 ఏళ్లు పైనే అయింది. పెళ్లై 70 ఏళ్లు అయినా.. షిండేకు భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. నెల రోజుల క్రితం భార్య వన్ గ్రామ్ గోల్డ్ మంగళసూత్రం కావాలని అడిగింది. మంగళసూత్రం కొనడానికి డబ్బులు లేవని తెలిసినా.. భార్య అడిగిందని కాదనలేకపోయాడు.
డబ్బుల కోసం నెల రోజుల నుంచి భిక్షమెత్తాడు. రూపాయి, రూపాయి పోగు చేశాడు. దాన్నంతా ఓ గుడ్డ సంచిలో వేసుకుని భార్యతో కలిసి షాపుకు వెళ్లాడు. వారిని చూడగానే.. సాయం అడగడానికి వస్తున్నారేమో అని షాపులోని సిబ్బంది భావించారు. ఏం కావాలని అడిగారు. తన భార్యకు మంగళసూత్రం కావాలని షిండే చెప్పాడు. షాపు ఓనర్ ఆశ్చర్యపోయాడు. ఎమోషనల్ కూడా అయ్యాడు. కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుని మంగళసూత్రాన్ని ఇచ్చేశాడు.
ఇవి కూడా చదవండి
చీరలో ఉంటే ఎవరూ కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ..
20 నిమిషాల్లో పెళ్లి.. వరుడు చేసిన పనికి వధువు షాక్..
Updated Date - Jun 19 , 2025 | 06:36 PM