Share News

Viral Video: 20 నిమిషాల్లో పెళ్లి.. వరుడు చేసిన పనికి వధువు షాక్..

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:06 PM

Marriage Is Temporary: చెర్డ్‌లీస్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. మిలియన్‌కు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.

Viral Video: 20 నిమిషాల్లో పెళ్లి.. వరుడు చేసిన పనికి వధువు షాక్..
Marriage Is Temporary

పెళ్లనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోయే మధురఘట్టం. అందుకే పెళ్లి ఫొటోల్లో, వీడియోల్లో అందంగా కనిపించాలని ఆడ,మగ ఇద్దరూ తపనపడుతూ ఉంటారు. పెళ్లికి నెలల ముందు నుంచే శరీరం మీద దృష్టి సారిస్తూ ఉంటారు. బ్యూటీ టిప్స్, హోమ్ రెమిడీస్ ఫాలోఅవుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. అబ్బాయిలయితే జిమ్ములకు వెళుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా పెళ్లి రోజు వచ్చే సరికి.. చెమట పట్టకుండా.. దుస్తులు నలగకుండా ఉండాలనే వధూవరులు అనుకుంటారు.


మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో వరుడు మాత్రం పెళ్లికి 20 నిమిషాల ముందు జిమ్ముకు వెళ్లాడు. ముహూర్తం దగ్గర పడుతున్నా అతడు మాత్రం రాలేదు. దీంతో అతడు జిమ్ చేస్తున్న చోటుకు పెళ్లి కూతురు వెళ్లింది. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది. చెర్డ్‌లీస్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. మిలియన్‌కు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.


పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఉన్నారు. ‘పెళ్లి క్యాన్సిల్ చేసేయ్’..‘గట్టిగా అరవటం మానేయ్.. అతడ్ని పెళ్లి చేసుకోవద్దు. నీ విలువ నువ్వు తెలుసుకో’..‘పెళ్లి తాత్కాళికం.. బాడీ బిల్డింగే శాశ్వతం’..‘ఈ పెళ్లి 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిలబడదు. ఇద్దరూ విడిపోతారు’..‘ఇలా నిన్ను ఇబ్బందిపెట్టే వ్యక్తిని నువ్వు అస్సలు పెళ్లి చేసుకోకు.’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం అదంతా డ్రామా అని కొట్టి పారేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అతడి ఫోన్‌లో 13 వేల అసభ్య ఫొటోలు, వీడియోలు

రౌడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టాలని చూస్తున్నారు

Updated Date - Jun 19 , 2025 | 04:10 PM