Share News

Youngman From Sandur: అతడి ఫోన్‌లో 13 వేల అసభ్య ఫొటోలు, వీడియోలు

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:12 PM

Youngman From Sandur: పోలీసులు అతడి ఫోన్ చెక్ చేసి చూడగా.. 13 వేల మంది ఆడవాళ్లకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. శుభం 10 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు తెలిసింది.

Youngman From Sandur: అతడి ఫోన్‌లో 13 వేల అసభ్య ఫొటోలు, వీడియోలు
Youngman From Sandur

ఆడవారి పేరుతో సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసి పాడు పనులకు పాల్పడుతున్న ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అతడి ఫోన్ చెక్ చేసి చూడగా.. 13వేల అసభ్యకర ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. అతడు చేసే పనుల గురించి తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, బళ్లారిలోని సందూరుకు చెందిన శుభం కుమార్ మనోజ్ ప్రసాద్ సింగ్ అనే 25 ఏళ్ల యువకుడు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో డిప్లొమా చదివాడు.


ఢిల్లీలో చదువుకున్న అతడు సందూరు వచ్చాడు. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఏం పోయేకాలమో ఏమో తెలీదు కానీ.. ఓ పాడు పనికి తెరతీశాడు. సోషల్ మీడియాలో ఆడవాళ్ల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. వాటిలో మహిళలు, అమ్మాయిలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ఉన్నాడు. అంతేకాదు.. సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లతో పరిచయం పెంచుకునే వాడు. న్యూడ్ వీడియో కాల్స్ చేయమని బలవంతం చేసే వాడు. వాళ్లు ఇందుకు ఒప్పుకోకపోతే తన క్రూర బుద్ధి బయటపెట్టేవాడు.


వాళ్ల పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేవాడు. అందులో అశ్లీల ఫొటోలు, వీడియోలు పెట్టేవాడు. ఈ నేపథ్యంలోనే ముంబైకి చెందిన ఓ యువతి పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. అశ్లీల ఫొటోలు, వీడియోలు అందులో షేర్ చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. గూగుల్ ఆధారంగా శుభం ఎక్కడ ఉన్నాడో కనిపెట్టారు. అతడ్ని అరెస్ట్ చేశారు.

పోలీసులు అతడి ఫోన్ చెక్ చేసి చూడగా.. 13 వేల మంది ఆడవాళ్లకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. శుభం 10 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు.. ఫేక్ అకౌంట్స్ కోసం అతడు ఏకంగా 90 మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నట్లు బయటపడింది.


ఇవి కూడా చదవండి

రక్తహీనత లేకపోయినా బలహీనంగా ఉన్నారా? అయితే.. అది ఇదే కావచ్చు..

రెండు పెగ్గులేస్తే అలాగే ఉంటుంది.. ఎద్దు ఎగిరిపడేసినా ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

Updated Date - Jun 19 , 2025 | 03:17 PM