Share News

Funny Video: రెండు పెగ్గులేస్తే అలాగే ఉంటుంది.. ఎద్దు ఎగిరిపడేసినా ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Jun 19 , 2025 | 02:02 PM

ఎద్దు అత్యంత బలంగా ఉంటుంది. రోడ్ల మీద ఎద్దును చూసిన వారు దూరంగా వెళ్లిపోతారు. ఎందుకంటే అది ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. అది దాడి చేసిందంటే ఎముకలు విరిగిపోవడం ఖాయం. అందుకే దాని జోలికి ఎవరూ వెళ్లరు.

Funny Video: రెండు పెగ్గులేస్తే అలాగే ఉంటుంది.. ఎద్దు ఎగిరిపడేసినా ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..
Bull threw drunken man into drain

ఎద్దు (Bull) అత్యంత బలంగా ఉంటుంది. రోడ్ల మీద ఎద్దును చూసిన వారు దూరంగా వెళ్లిపోతారు. ఎందుకంటే అది ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. అది దాడి చేసిందంటే ఎముకలు విరిగిపోవడం ఖాయం. అందుకే దాని జోలికి ఎవరూ వెళ్లరు. అయితే రెండు పెగ్గులేసిన తర్వాత మాత్రం ఎద్దుకైనా సరే ఎదురువెళ్లే వాళ్లు ఉంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తిని ఎద్దు కాలువలోకి విసిరేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై ఓ ఎద్దు ఉంది. మద్యం సేవించిన ఓ వ్యక్తి ఆ ఎద్దుకు ఎదురుగా వెళ్లి నిల్చున్నాడు. దీంతో ఆ ఎద్దు తన కొమ్ములతో ఆ వ్యక్తిని ఎగరేసింది. దీంతో ఆ వ్యక్తి పక్కనే ఉన్న కాలువలో పడ్డాడు. తన తల పూర్తిగా కాలువలో పడిపోయింది. అతడు మళ్లీ తిరిగి లేవలేడు అనుకుంటే మరుక్షణంలోనే పైకి లేచి నిలబడ్డాడు. అక్కడ ఏమీ జరగనట్టే నడుచుకుంటూ వెనక్కి వెళ్లి నిలబడ్డాడు.


ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. అతడు అమరేంద్ర బాహుబలి కుటుంబానికి చెందిన వాడై ఉంటాడని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. అతడు ఏం తాగాడో తెలిస్తే బాగుండేది అంటూ మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

హోటల్‌లో ప్రియుడితో సరసాలు.. భర్త రాగానే ఆమె చేసిన నిర్వాకం ఏంటంటే..

చావుతో చెలగాటం.. కదులుతున్న ట్రైన్ కింద నుంచి ఎలా వచ్చాడో చూడండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2025 | 02:02 PM