Share News

Shocking Video: చావుతో చెలగాటం.. కదులుతున్న ట్రైన్ కింద నుంచి ఎలా వచ్చాడో చూడండి..

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:45 PM

సోషల్ మీడియా అందుబాటులోనికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వైరల్ వీడియోలను రూపొందించేందుకు కొందరు విచిత్రమైన పనులు చేస్తున్నారు.

Shocking Video: చావుతో చెలగాటం.. కదులుతున్న ట్రైన్ కింద నుంచి ఎలా వచ్చాడో చూడండి..
Viral Train Stunt video

సోషల్ మీడియా అందుబాటులోనికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వైరల్ వీడియోలను రూపొందించేందుకు కొందరు విచిత్రమైన పనులు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి వీడియోలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆశ్చర్యపరుస్తోంది (Viral Train Stunt video).


@revengeseeker07 అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువకుడు రైలు వస్తున్న సమయంలో రైలు (Train) పట్టాల మీద పడుక్కున్నాడు. రైలు అతడి మీదుగా వెళ్తుండగా అతడి స్నేహితుడు పక్కనే ఉండి మొబైల్ ద్వారా వీడియో తీస్తున్నాడు. పై నుంచి రైలు వెళ్తోందనే భయం కూడా లేకుండా ఆ యువకుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు కదులుతున్న రైలు రెండు చక్రాల మధ్య నుంచి తన బ్యాగ్‌ను బయటకు విసిరేశాడు.


అనంతరం రైలు కదులుతుండగానే లోపలి నుంచి బయటకు వచ్చేశాడు. ఒక్క క్షణం తేడా వచ్చినా అతడి ప్రాణం కచ్చితంగా పోయి ఉండేది. అంత భయంకరమైన స్టంట్ చేసిన కుర్రాడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది. చూడడానికి ఆ కుర్రాళ్లు పాశ్చాత్య దేశాలకు చెందిన వారిలా కనిపిస్తున్నారు. ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయంలో క్లారిటీ లేదు.


ఇవి కూడా చదవండి..

హోటల్‌లో ప్రియుడితో సరసాలు.. భర్త రాగానే ఆమె చేసిన నిర్వాకం ఏంటంటే..

మీ మెదడుకు సవాల్.. ఈ కూరగాయల మధ్యనున్న చెర్రీని 5 సెకెన్లలో కనిపెట్టండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2025 | 01:45 PM