Share News

Viral News: హోటల్‌లో ప్రియుడితో సరసాలు.. భర్త రాగానే ఆమె చేసిన నిర్వాకం ఏంటంటే..

ABN , Publish Date - Jun 19 , 2025 | 08:20 AM

ఆమె వివాహిత.. పెళ్లి జరిగి ఆరేళ్లకు పైగా అవుతోంది.. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.. అయితే ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్తకు తెలియకుండా ప్రయుడిని తరచుగా కలుస్తోంది.. చివరకు ఆ విషయం భర్తకు తెలిసిపోయింది.. అలాంటి పనులు చేయవద్దని పలుసార్లు హెచ్చరించాడు.

Viral News: హోటల్‌లో ప్రియుడితో సరసాలు.. భర్త రాగానే ఆమె చేసిన నిర్వాకం ఏంటంటే..
Woman jumping from the hotel

ఆమె వివాహిత.. పెళ్లి జరిగి ఆరేళ్లకు పైగా అవుతోంది.. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.. అయితే ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్త (Husband)కు తెలియకుండా ప్రయుడిని తరచుగా కలుస్తోంది.. చివరకు ఆ విషయం భర్తకు తెలిసిపోయింది.. అలాంటి పనులు చేయవద్దని పలుసార్లు హెచ్చరించాడు.. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. దీంతో ఆ భర్త తన భార్యకు, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించాడు (Extramarital Affair).


ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లోని బాగ్‌పత్ జిల్లాలో బడౌత్ పట్టణానికి చెందిన ఓ మహిళకు 2019లో వివాహం జరిగింది. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఆమెకు భర్తతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె శోభిత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడిని తరచుగా కలుస్తుండేది. భర్తకు తెలిసి హెచ్చరించినా ఆమె తీరులో మార్పురాలేదు. ఇటీవల ప్రియుడు శోభిత్‌ను కలిసేందుకు ఓ హోటల్‌కు వెళ్లింది. విషయం తెలుసుకున్న భర్త పోలీసులతో కలిసి ఆ హోటల్‌కు వెళ్లాడు.


పోలీసులతో కలిసి వస్తున్న భర్తను చూసిన సదరు మహిళ హోటల్ బాల్కనీ నుంచి పక్క ఇళ్ల మీదకు దూకి అక్కడి నుంచి పారిపోయింది. ఆమె భర్త, పోలీసులు మాత్రం హోటల్‌లో ఉన్న శోభిత్‌ను పట్టుకున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాహేతర సంబంధం గురించి శోభిత్‌ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా, ఈ మహిళ హోటల్ నుంచి దూకి పారిపోతుండడాన్ని చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మీ మెదడుకు సవాల్.. ఈ కూరగాయల మధ్యనున్న చెర్రీని 5 సెకెన్లలో కనిపెట్టండి..

ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో.. బావిలో పడిన బంతిని ఎలా తీశారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 19 , 2025 | 08:20 AM