Viral Video: చీరలో ఉంటే ఎవరూ కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ..
ABN , Publish Date - Jun 19 , 2025 | 05:44 PM
Viral Video: ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన అతడిపై కేసు నమోదు అయింది. ఇక, అప్పటినుంచి పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారు. అతడి ఇంటికి పలు మార్లు వెళ్లారు.
పైన ఫొటోలో ఆడ వేషంలో ఉన్న వ్యక్తి పేరు దయా శంకర్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. రాజస్థాన్‌కు చెందిన అతడి మీద 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెదిరింపులు, దొంగతనాలు, కొట్లాటలు ఇలా అన్ని రకాలుగా నేరాలకు పాల్పడ్డాడు. పోలీసులు అతడ్ని పట్టుకుందామనుకునే లోపు కనిపించకుండా పోయాడు. చీర కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. చీరలో ఉన్న తనను ఎవరూ గుర్తుపట్టలేరన్న ధీమాతో.. వీధులు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. అయితే, ఎలా తెలిసిందో కానీ, పోలీసులకు దయా గురించి తెలిసి పోయింది.
పక్కా ప్లాన్‌తో అతడ్ని జోధ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దయాను స్టేషన్‌కు ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఫిబ్రవరి నెలలో దయా శంకర్.. 23 ఏళ్ల ప్రిన్స్ చావ్లా అనే యువకుడిపై తన గ్యాంగుతో దాడికి దిగాడు. అతడ్ని ఆ గ్యాంగు కర్రలు, బాటిళ్లతో చావకొట్టింది. కేసు పెడితే చంపేస్తామని బెదిరించింది. అయినా ప్రిన్స్ భయపడేలేదు. దెబ్బల నుంచి కోలుకున్నాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వారిపై కేసు పెట్టాడు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన అతడిపై కేసు నమోదు అయింది. ఇక, అప్పటినుంచి పోలీసులు అతడి కోసం అన్వేషిస్తున్నారు. అతడి ఇంటికి పలు మార్లు వెళ్లారు. అక్కడ అతడు కనిపించలేదు. ఆ ఇంట్లో ఓ మహిళ మాత్రం కనిపించింది. కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఓ సమాచారం అందింది. ఆ సమాచారంతో పోలీసులు షాక్ అయ్యారు. దయా ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న మహిళ విగ్గు పట్టుకుని లాగగా అసలు విషయం బయటపడింది. మహిళ వేషంలో ఉన్నది దయా అని తేలింది.
ఇవి కూడా చదవండి
20 నిమిషాల్లో పెళ్లి.. వరుడు చేసిన పనికి వధువు షాక్..
అతడి ఫోన్‌లో 13 వేల అసభ్య ఫొటోలు, వీడియోలు