ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Funny Video: కారు డిక్కీని ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN, Publish Date - Aug 14 , 2025 | 03:47 PM

ఓ వ్యక్తి కారు డిక్కీని వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. రోడ్డుపై వాహనంలో వెళ్తున్న వారు తమ ముందు వెళ్తున్న కారు డిక్కీ చూసి షాక్ అయ్యారు. సాధారణంగా కారు డిక్కీలో లగేజీ వేయడం చూస్తుంటాం. కొన్నిసార్లు ..

బైకు, ఆటో, కారు తదితర వాహనాలను కొందరు వాడే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. బైకుపై అనేక మందిని ఎక్కించుకుని డ్రైవ్ చేయడం, ఆటోను కారు తరహాలో మార్చడం, ఇక కారులో అయితే స్విమ్మింగ్ పూల్ సిద్ధం చేయడం, హెలీకాప్టర్‌ తరహాలో రూపొందించడం తదితర ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషలో మీడియలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి కారు డిక్కీని వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసి వారంతా.. ‘కారు డిక్కీని ఇలా వాడడం ఇప్పుడే చూస్తున్నాం’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారు డిక్కీని వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. రోడ్డుపై వాహనంలో వెళ్తున్న వారు తమ ముందు వెళ్తున్న కారు డిక్కీ చూసి షాక్ అయ్యారు. సాధారణంగా కారు డిక్కీలో లగేజీ వేయడం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు జంతువులను కూడా కారు డిక్కీలో తీసుకెళ్తుంటారు.

అయితే ఇంతను అందుకు పూర్తి విరుద్ధంగా ఏకంగా నలుగురు (Four young women sitting in car trunk) యువతులను డిక్కీలో కూర్చోబెట్టాడు. డిక్కీ డోరు పైకి పెట్టి, లోపల యువతులను వరుసగా కూర్చోబెట్టాడు. ఒకరు కూర్చోవడమే కష్టం అనుకుంటే.. ఇతనేమో ఏకంగా నలుగురు యువతులను ఇలా విచిత్రంగా కుక్కేసి తీసుకెళ్తున్నాడు. ఇతడి విచిత్ర ప్రయోగం చూసి మిగతా వాహనదారులంతా అవాక్కవుతున్నారు. వెనుక వాహనంలో వెళ్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కారు డిక్కీని ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కొందరు, ‘ఈ కారు డ్రైవర్ తెలివితేటలు మామూలుగా లేవుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా లైక్‌లు, 2.23 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 03:47 PM