ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jugaad Viral Video: ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యం.. పెట్రోల్ ట్యాంక్ మూతను ఎలా సెట్ చేశాడంటే..

ABN, Publish Date - May 02 , 2025 | 06:21 PM

బైక్ పెట్రోల్ మూత పాడైతే ఎవరైనా ఏం చేస్తారు.. దాన్ని మార్చేసి కొత్త మూతను ఏర్పాటు చేసుకుంటారు కదా. కానీ ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు.

కొందరు తెలివితో చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు టెక్నిక్‌తో చేసే పనులు చూసినప్పుడు అంతా అవాక్కవ్వాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇంకొందరు చిన్న చిన్న సమస్యలకూ వింత వింత ట్రిక్స్‌తో పరిష్కారాలు కనుక్కుంటుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకు పెట్రోల్ ట్యాంక్ మూతను సెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బైక్ పెట్రోల్ మూత పాడైతే ఎవరైనా ఏం చేస్తారు.. దాన్ని మార్చేసి కొత్త మూతను ఏర్పాటు చేసుకుంటారు కదా. కానీ ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు.

Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..


బైక్ పెట్రోల్ మూత లాక్ (Bike Petrol Tank) దెబ్బతినడంతో.. దానికి వినూత్న పరిష్కారం కనుక్కున్నాడు. మూత పైకి రాకుండా ఉండేందుకు ట్యాంక్‌పై తలుపునకు సంబంధించిన గొల్లెం అమర్చాడు. మూత పక్కనే గొల్లెం ఏర్పాటు చేసి, దాన్ని ముందుకు జరపడం ద్వారా మూతను లాక్ చేశాడన్నమాట. ఇలా పాడైన మూతను తలుపు గొల్లెం సాయంతో సెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Stunt Viral Video: మృత్యువుతో ఆడుకోవడమంటే ఇదే.. రైలు పట్టాలపై ఇతడి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్ ఇలాంటి టాలెంట్ ఇండియాలోనే సాధ్యం’’.. అంటూ కొందరు, ‘‘తలుపు గొల్లాన్ని ఇలాక్కూడా సెట్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 3.43 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Viral Video: దండ వేయమంటే ఇలా చేసిందేంటీ.. మొత్తానికి వరుడికి గట్టి షాకే ఇచ్చిందిగా..

Updated Date - May 02 , 2025 | 06:21 PM