ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Desh Rangila Dance: దేశ్ రంగీల పాటకు రిహార్సల్స్.. డ్యాన్స్ అదరగొట్టిన ఉపాధ్యాయుడు

ABN, Publish Date - Aug 15 , 2025 | 12:20 PM

Desh Rangila Dance: స్కూలు విద్యార్థులు ‘దేశ్ రంగీలా’ పాటకు రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. వారి ఉపాధ్యాయుడు ఆ పాటకు వారితో రిహార్సల్స్ చేయిస్తున్నాడు. అదిరిపోయే స్టెప్స్ వారితో వేయిస్తున్నాడు.

Desh Rangila Dance

ఒక్కసారి ఓ 15 ఏళ్లు వెనక్కు వెళ్లండి. మీ చిన్ననాటి ఆగస్టు 15 రోజులు గుర్తు తెచ్చుకోండి. ‘దేశ్ రంగీల’ పాటను ఖచ్చితంగా వినే ఉంటారు. 2006 నుంచి ఆగస్టు 15 రోజున అమ్మాయిలు ఈ పాటకు డ్యాన్స్ చేయటం అన్నది ఓ ఆనవాయితీగా మారిపోయింది. 2006లో విడుదలైన హిందీ సినిమా ‘ఫనా’లోది ఈ పాట. దేశ భక్తిగా గీతంగా ఇప్పటికీ ఈ పాట చాలా ఫేమస్. ఆగస్టు 15, జనవరి 26 వచ్చాయంటే స్కూల్లో ఆడపిల్లలు ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా, ఈ పాటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెండు రోజుల క్రితం ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుడు ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. స్కూలు విద్యార్థులు ఆగస్టు 15న డ్యాన్స్ చేయటం కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ‘దేశ్ రంగీలా’ పాటకు రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. వారి ఉపాధ్యాయుడు ఆ పాటకు వారితో రిహార్సల్స్ చేయిస్తున్నాడు. అదిరిపోయే స్టెప్స్ వారితో వేయిస్తున్నాడు. పిల్లలతో సమానంగా ఆయన కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు.

ఇక, వైరల్‌గా మారిన ఆ వీడియోపై వెయ్యికి పైగా మంది నెటిజన్లు స్పందించారు.. ‘ఆ టీచర్‌కు ఓ సెల్యూట్’..‘ఆ టీచర్‌ను వాళ్లు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు’..‘నా చిన్నప్పటినుంచి చూస్తున్నా.. అందరు టీచర్లు ఒకే స్టెప్ వేయిస్తున్నారు’..‘జోకులు పక్కన పెడితే ఆ టీచర్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు’.. ‘వీడియో చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది బెంచీలో కూర్చున్న షర్టులేని పిల్లాడిపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్‌

కూటమి పాలనలో సంక్షేమానికి సాటిలేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు

Updated Date - Aug 15 , 2025 | 12:26 PM