CM Chandrababu Naidu: కూటమి పాలనలో సంక్షేమానికి సాటిలేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:07 AM
CM Chandrababu Naidu: కూటమి పాలనలో సంక్షేమానికి సాటిలేదని, అభివృద్ధికి ఎదురు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమిని ప్రజలు దీవించారని పేర్కొన్నారు.
కూటమి పాలనలో సంక్షేమానికి సాటిలేదని, అభివృద్ధికి ఎదురు లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 94 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమిని ప్రజలు దీవించారని పేర్కొన్నారు. విద్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామని ఆయన అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్ర్య వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్ధేశించి మాట్లాడుతూ..
‘నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. గత అయిదేళ్లు అప్పులు, తప్పులు చేశారు. పోలవరం, అమరావతి అగిపోయాయి. పెట్టుబడులు వెనెక్కి వెళ్లిపోయాయి. మా ఏడాది పాలన ఎంతో సంతృప్తి నిచ్చింది. విద్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలు అవుతోంది. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసి సంక్షేమ పాలనకు కొత్త రూపు ఇచ్చాము’ అని అన్నారు.
ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా
ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్నామన్నారు. ఏపీలో ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ ద్వారా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పండుగ జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 40 వేల కోట్ల రూపాయలకు పైగా పెన్షన్‌ల కోసం ఖర్చు చేశామన్నారు. తల్లికి వందనం పథకం కోసం 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా వారందరికి పథకం అమలు చేశామని తెలిపారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బావుంటుందని, అందుకే అన్నదాత సుఖీభవ అందజేశామని అన్నారు. 47 లక్ష మంది రైతులకు 3170 కోట్ల రూపాయలు అందించామని వెల్లడించారు. దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి భారాన్ని తగ్గించామన్నారు. ఏడాదికి 2684 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు వేలాది రూపాయలు ఆదా అవుతాయని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని వెల్లడించారు. మెగా డీఎస్సీ పథకాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి: సీఎం రేవంత్
బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు