Share News

CM Naidu On Banakacharla: బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 10:26 AM

Chandrababu: బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

CM Naidu On Banakacharla: బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

విజయవాడ, ఆగస్టు 15: పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని.. సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటాం అని అన్నారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలనూ భరిస్తున్నామని.. అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటి? అని పరోక్షంగా తెలంగాణ సర్కార్‌కు ప్రశ్నను సంధించారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా? అని నిలదీశారు. కాగా రాయలసీమను నీటితో సశ్యశామలంగా చేసేందుకు బనకచర్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే . అయితే దీనికి తెలంగాణ సర్కార్ నో చెప్పడంతో వివాదం రాజుకుంది.


కఠిన చర్యలు ఉంటాయి..

మహిళలను సోషల్ మీడియాలో వేధించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు సీఎం. రేషన్ బియ్యం రిసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేశామన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాయలసీమలో సాగునీరు అందించే HNSSపై గత ప్రభుత్వ నాటకం ఆడిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే 3,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తూ 2026 జులై నాటికి నీరు ఇస్తామని తెలిపారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం నుంచి బనకచర్లకు నీరు అందిస్తాం అని ప్రకటన చేశారు. మిగులు జలాలను, వరద నీటిని ఉపయోగించుకుంటామని.. వరదను బరించాలి అయితే వాటిని వాడకూడదు అంటే ఎలా అని ప్రశ్నించారు. 785టిఎంసి నీళ్లు వివిధ రిజర్వాయర్ లలో నిల్వ ఉన్నాయని అన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!

Updated Date - Aug 15 , 2025 | 11:23 AM