ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Couple in Indian Attire: ఇది ఇండియానేనా.. భారతీయ దస్తులు వేసుకుంటే ఇంత దారుణమా..

ABN, Publish Date - Aug 09 , 2025 | 12:05 PM

Couple In Indian Attire: హోటల్‌కు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. పంజాబీ డ్రెస్ వేసుకుందన్న కారణంతో ఓ మహిళను హోటల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

Couple In Indian Attire

వేష, భాషలు.. ఆహారపు అలవాట్ల కారణంగా పరాయి దేశాల్లో నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్న భారతీయులు లెక్కలేనంత మంది. బయటి దేశాల వారికి మన గురించి, మన పద్దతుల గురించి తెలీదు కాబట్టి.. అందులో పెద్దగా బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. కానీ, సొంత దేశంలో కూడా దుస్తుల కారణంగా అవమానాలు ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయు దుస్తులు వేసుకుంటే లోపలికి అనుమతించని హోటళ్లు చాలానే ఉన్నాయి.

తాజాగా, హోటల్‌కు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. పంజాబీ డ్రెస్ వేసుకుందన్న కారణంతో ఓ మహిళను హోటల్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ జంట పీతమ్‌పురలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అయితే, మహిళ పంజాబీ డ్రెస్ వేసుకుందన్న కారణంతో రెస్టారెంట్ లోపలికి అనుమతి నిరాకరించారు. దీంతో ఆ జంట హోటల్ సిబ్బందితో గొడవకు దిగింది. ఈ సందర్భంగా ఆ జంట మాట్లాడుతూ..‘భారతీయ దుస్తులు ధరించిన కారణంగా మమ్మల్ని లోపలికి రానివ్వటం లేదు. మేనేజర్ మాతో తప్పుగా ప్రవర్తించాడు. ఇలాంటి హోటల్ని మూసి వేయాలి’ అంటూ ఫైర్ అయ్యారు.

అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా స్పందించారు. సంఘటనపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరో పోస్టులో .. ‘ఇకపై ఆ రెస్టారెంట్ దుస్తుల ఆధారంగా ఎంట్రీని నిర్ణయించదు. భారతీయ దుస్తుల్లో వెళ్లినా స్వాగతం పలుకుతుంది. రక్షా బంధన్ సందర్భంగా అక్కచెల్లెళ్లకు డిస్కౌంట్ కూడా ఇస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే, రెస్టారెంట్ ఓనర్ ఆ జంట వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ‘వాళ్లు హోటల్‌లో సీట్లు బుక్ చేసుకోలేదు. మా దగ్గర దస్తులపై బ్యాన్ పాలసీ లేదు. అందరినీ స్వాగతిస్తాం’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

రాఖీ పండుగ రోజు అద్భుతమైన గిఫ్ట్.. అన్నకు ప్రాణ దానం..

ఒకే అమ్మాయితో పెళ్లి.. అసలు సంగతి చెప్పిన అన్నదమ్ములు..

Updated Date - Aug 09 , 2025 | 12:11 PM