Share News

Himachal Jodidar Brothers: ఒకే అమ్మాయితో పెళ్లి.. అసలు సంగతి చెప్పిన అన్నదమ్ములు..

ABN , Publish Date - Aug 09 , 2025 | 09:55 AM

Himachal Jodidar Brothers: అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కొంతమంది కపిల్, ప్రదీప్‌లను టార్గెట్ చేసి బూతులు తిట్టడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవటంతో అన్నదమ్ములు ఇద్దరూ స్పందించారు.

Himachal Jodidar Brothers: ఒకే అమ్మాయితో పెళ్లి.. అసలు సంగతి చెప్పిన అన్నదమ్ములు..
Himachal Jodidar Brothers

హిమాచల్ ప్రదేశ్‌, షిల్లాయ్ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు కపిల్, ప్రదీప్‌లు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కున్హత్ గ్రామానికి చెందిన సునిత చౌహాన్ అనే యువతితో 20 రోజుల క్రితం వీరి పెళ్లి అయింది. హత్తి తెగలో వందల ఏళ్లుగా అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. వందల ఏళ్ల ఆచారాన్ని గౌరవిస్తూ జులై 12వ తేదీన కపిల్, ప్రదీప్‌లు సునీతను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే విమర్శలు సైతం మొదలయ్యాయి.


అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. కొంతమంది కపిల్, ప్రదీప్‌లను టార్గెట్ చేసి బూతులు తిట్టడం మొదలెట్టారు. సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువవటంతో అన్నదమ్ములు ఇద్దరూ స్పందించారు. ఈ మేరకు తమ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టుపెట్టారు. ఆ పోస్టులో.. ‘కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. మేము వాటిని లెక్కచేయము. జోడీ ధర మా ప్రాంతంలోనే కాదు.. జౌన్సర్ బవర్, ఉత్తరాఖండ్‌లలో కూడా ఉంది.


మా ఆచారాల గురించి ఏమీ తెలియకుండానే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అందరి అంగీకారంతోటే ఈ పెళ్లి జరిగింది. హెడ్ లైన్స్‌లో నిలబడ్డానికి మేము పెళ్లి చేసుకోలేదు. ఎప్పటికీ కలిసి ఉండటం.. ఒకరిని ఒకరు ప్రేమించుకోవటమే ఈ పెళ్లి ఉద్దేశ్యం. దయ చేసి మమ్మల్ని తిట్టకండి. మాకంటూ మా సొంత జీవితాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే మేము జీవిస్తాము. కొన్ని చోట్ల బలవంతంగా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కానీ, మేము ఇష్టపడే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇందులో ఎవ్వరి బలవంతం లేదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ కొత్త లుక్ చూశారా? రెండు నెలల విరామం తర్వాత ప్రాక్టీస్..

రాఖీ సినిమా లెవెల్లో మేయర్ క్రేజ్.. ఏకంగా 20వేల రాఖీలతో రికార్డ్.

Updated Date - Aug 09 , 2025 | 10:03 AM