Bus in flood water: వరద నీటిలో బస్సు ప్రయాణం.. కొన్నిసార్లు ఇలాక్కూడా జరగొచ్చు..
ABN, Publish Date - Aug 19 , 2025 | 03:53 PM
రోడ్డుపై భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. చాలా మంది తమ వాహనాలను రోడ్డుకు రెండు వైపులా నిలుపుకొని ఉన్నారు. అయితే ఓ ప్రైవేట్ బస్సు వాగు దాటడానికి ప్రయత్నించింది. దాన్ని చూసి మరో బస్సు కూడా నీటిలోకి దిగింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రస్తుతం ఎక్కడ చూసినా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాల కారణంగా వరద నీరు పొటెత్తుతోంది. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడి కొన్నిచోట్ల, వరద నీటిని దాటే క్రమంలో మరికొన్నిచోట్ల ప్రమాదాలు జరగడం చూస్తున్నాం. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై వరద నీరు భారీగా ప్రవహిస్తున్నా కూడా ఓ బస్సు వాగు దాటేందుకు ప్రయత్నించింది. దాన్ని చూసి మరో బస్సు కూడా నీటిలోకి దిగింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. చాలా మంది తమ వాహనాలను రోడ్డుకు రెండు వైపులా నిలుపుకొని ఉన్నారు. అయితే ఓ ప్రైవేట్ బస్సు వాగు దాటడానికి ప్రయత్నించింది. దాన్ని చూసి మరో బస్సు కూడా నీటిలోకి దిగింది. అంతా చూస్తుండగానే ఆ రెండు బస్సులూ వాగు దాటేందుకు ప్రయత్నించాయి.
ముందు వెళ్లిన బస్సు సాఫీగా రోడ్డు దాటేయగా.. వెనుక వెళ్లిన బస్సు మధ్యలోకి (Bus loses control in floodwater)వెళ్లగానే అదుపు తప్పింది. డ్రైవర్‌కు అనుభవం లేదో ఏమో గానీ.. వాహనం చివరకు రోడ్డు పక్కకు లాక్కుపోయింది. అయినా బస్సును డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. దీంతో చివరకు బస్సు రోడ్డు నుంచి కిందకు జారి వరద నీటిలో చిక్కుకుపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. అయితే ఈ క్రమంలో ఓ వ్యక్తి బస్సు వెనుక పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలో అక్కడున్న వారంతా వరద నీటిలోకి దిగి, ప్రయానికులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అనుభవం లేని డ్రైవర్ కారణంగానే ఇలా జరిగింది’.. అంటూ కొందరు, ‘వేల కిలోల బస్సు కొట్టుకుపోతుంటే.. 60 కిలోల వ్యక్తి అదే నీటిలో పరుగులు తీస్తున్నాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Aug 19 , 2025 | 03:53 PM