ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Biker Viral Video: బైకును లగేజీ ట్రాలీగా మార్చాడుగా.. ఇతడి తెలివి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN, Publish Date - May 22 , 2025 | 04:28 PM

ఓ వ్యక్తి పొడవాటి వెదరు కర్రలను మొసుకెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎవరైనా సామాన్లు లగేజీ వాహనాల్లో వేసుకుని వెళ్తారు. కానీ ఇతను తీసుకెళ్లిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడో మీరే చూడండి..

కొందరు బైకులపై విచిత్ర విన్యాసాలు చేస్తూ అందరికీ ఆగ్రహం తెప్పిస్తుంటారు. మరికొందరు అదే బైకులతో విచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. కొందరైతే ఎవరూ చేయని విధంగా ఏవేవో సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకును లగేజీ ట్రాలీలా వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇతడి తెలివి మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పొడవాటి వెదరు కర్రలను మొసుకెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎవరైనా సామాన్లు లగేజీ వాహనాల్లో వేసుకుని వెళ్తారు. కానీ ఇతను మాత్రం అలా చేయకుండా తన బైకుపైనే తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతాడు.

అనవసరంగా వరుడికి తిక్క రేపాడుగా.. సడన్‌గా బుగ్గ గిల్లేయడంతో.. చివరకు..


ఇందుకోసం వెదురు కర్రలన్నింటినీ కట్టకట్టి , తన బైక్ వెనుక భాగాన కడతాడు. ఆ తర్వాత మరో వైపు రెండు సైకిల్ చక్రాల మధ్యలో ఓ ఇనుప రాడ్డు అమర్చి, ఆ చక్రాల మధ్యలోని రాడ్‌పై కర్రలను పెడతాడు. ఇలా మొత్తం కట్టేశాక.. (Man Carrying Bamboo Sticks On Bike) బైకుపై కూర్చుని రయ్యిన దూసుకెళ్లాడు.

ఎలక్ట్రీషియన్లకే షాక్ ఇచ్చాడుగా..


రోడ్డుపైకి వెళ్లిన ఈ బైకర్‌ను అంతా వింతగా చూశారు. కొందరు ఇతడి బైకును వీడియోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైకును ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘అది బైకు అనుకున్నావా.. లేక లగేజీ ఆటో అనుకున్నావా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 84 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. కాటేయడంతో చివరకు..


ఇవి కూడా చదవండి..

దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..

ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 04:28 PM