ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ahmedabad Flight Accident: అద్భుతం.. అంత పెద్ద ప్రమాదంలోనూ భగవద్గీతకు ఏమీ కాలేదు..

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:08 PM

Bhagavad Gita: హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే భగవద్గీత పుస్తకం దొరికింది. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. భారీ మంటల్లో నుంచి కూడా ఆ పుస్తకం తప్పించుకుంది.

Bhagavad Gita

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం కుప్పకూలిన వెంటనే బాంబు పేలినట్లుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో పడి చాలా మంది కాలి బూడిద అయిపోయారు. యాదృచ్ఛికమో లేక దేవుడి లీలో తెలీదు కానీ, ప్రమాదం జరిగిన చోట.. విమాన శకలాల దగ్గర అద్భుతమైన విషయం బయటపడింది.

హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే భగవద్గీత పుస్తకం దొరికింది. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. భారీ మంటల్లో నుంచి కూడా ఆ పుస్తకం తప్పించుకుంది. కాలిపోకుండా బయటపడింది. అందులోని పేజీలు కొంచెం కూడా కాలలేదు. దాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మోదీ పరామర్శ

విమాన ప్రమాదం జరిగిన చోటుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. శుక్రవారం సంఘటనా స్థలంలో పర్యటించారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విమాన ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. బాధితులతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ విశ్వాస్ కుమార్‌ను మోదీ పరామర్శించారు.

ఇవి కూడా చదవండి

ఉదయం పేపర్లో యాడ్.. మధ్యాహ్నం విమాన ప్రమాదం..

మాజీ సీఎంను కాపాడలేకపోయిన లక్కీ నెంబర్..

Updated Date - Jun 13 , 2025 | 03:41 PM