Share News

Ahmedabad Flight Accident: మాజీ సీఎంను కాపాడలేకపోయిన లక్కీ నెంబర్..

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:22 AM

Ahmedabad Flight Accident: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి 1206 నెంబర్ అంటే పిచ్చి. ఆ నెంబర్‌ను తన లక్కీ నెంబర్‌గా భావించేవారు. ఆ నెంబర్‌తో సంబంధం ఉన్న రోజే ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టేవారు.

Ahmedabad Flight Accident: మాజీ సీఎంను కాపాడలేకపోయిన లక్కీ నెంబర్..
Ahmedabad Flight Accident

గుజరాత్: అహ్మదాబాద్ నుంచి లండన్ బయలు దేరిన ఏఐ 171 బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. గాల్లోకి లేచిన 30 సెకన్లకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇక్కడ విషాదకరమైన విషయం ఏంటంటే.. విజయ్ రూపానీ జీవితంలో లక్కీ నెంబర్.. అన్ లక్కీ నెంబర్‌గా మారింది. లక్కీ నెంబర్ రోజే ఆయన ప్రాణాలు కోల్పోయారు. అది కూడా దారుణమైన స్థితిలో మరణించారు.


అన్నింటికీ అదే నెంబర్

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి 1206 నెంబర్ అంటే పిచ్చి. ఆ నెంబర్‌ను తన లక్కీ నెంబర్‌గా భావించేవారు. ఆ నెంబర్‌తో సంబంధం ఉన్న రోజే ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టేవారు. కార్లకు, బైకులకూ అదే నెంబర్‌ తీసుకున్నారు. అయితే, ఊహించని విధంగా 1206(12వ తేదీ, 6 నెల) రోజే విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన లండన్‌లోని తన కుటుంబాన్ని కలుసుకోవడానికి విమానం ఎక్కారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..


రూపానీ.. విమానంలో కూర్చున్న సీటు నెంబర్ కూడా 12. విమానం ఎక్కిన సమయమూ 12.10. పాపం.. లక్కీ నెంబర్ ఆయన్ని ప్రమాదం నుంచి కాపాడలేకపోయింది. ఆయన విమానంలో కూర్చుని ఉండగా దిగిన చివరి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ప్రమాదం జరిగిన ప్రదేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. అక్కడ పర్యటించారు. అనంతరం ప్రమాదంలో గాయపడ్డ వారి దగ్గరకు వెళ్లి పరామర్శించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆమె చెప్పిందే జరిగింది

రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Updated Date - Jun 13 , 2025 | 03:34 PM