ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Arjun Erigaisi: ఇది అత్యంత దారుణ ప్రయాణానుభవం.. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌పై భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ గుస్సా

ABN, Publish Date - Jul 14 , 2025 | 07:12 PM

బ్రిటీష్ ఎయిర్‌వేస్‌పై భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి ఫైరైపోయారు. ఇందులో జర్నీ అత్యంత చెత్త ప్రయాణానుభవాన్ని మిగిల్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తూ తమకెదురైన అనుభవాలను పంచుకుంటున్నారు.

Arjun Erigaisi British Airways

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటీష్ ఎయిర్‌వేస్‌పై భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణానుభవం పరమ చెత్తగా ఉందని మండిపడ్డారు. ‘బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో జర్నీ అత్యంత చెత్త అనుభవాన్ని మిగిల్చింది. ఇన్‌వాలంటరీ డౌన్‌గ్రేడ్, ఉద్యోగుల దురుసు ప్రవర్తన, బ్యాగేజీ అందడటంలో దాదాపు 48 గంటల జాప్యం. ఇవి నిజంగా చిరాకు తెప్పించాయి. మెసేజీలు, ఈమెయిల్స్, ఫార్మ్స్ నింపడం ఇలా అన్నీ చేసినా రెండు రోజులుగా అటువైపు నుంచి సమాధానమే రాలేదు. ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ తన ప్రయాణికులతో ఇలా ఎలా వ్యవహరించగలదో నాకు అర్థం కావట్లేదు’ అని అన్నారు.

ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో తామూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నామని కొందరు చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్‌లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ కూడా ఒకటి అని ఓ వ్యక్తి అన్నాడు. యూరొప్ వెళ్లాలనుకుంటే ఖతర్ ఎయిర్‌వేస్ లేదా ఎమిరేట్స్‌లో ప్రయాణించాలని సూచించారు. ఆసియా దేశాలకు వెళ్లేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్, కాథే పసిఫిక్ బెస్ట్ అని తెలిపారు. ఇక అమెరికాలో కూడా ఖతర్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, యూనైటెడ్ ఎయిర్‌‌లైన్స్ మంచివని అన్నారు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌కు కూడా ఓసారి ఇలాంటి అనుభవం ఎదురైందని మరో నెటిజన్ చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది.

ఇక సెప్టెంబర్‌‌లో జరగనున్న ఫిడే గ్రాండ్ స్విస్ 2025 టోర్నమెంట్‌లో ఇరిగేశి, వరల్డ్ ఛాంపియన్ గుకేశ్‌తో కలిసి పాల్గొననున్నారు. ఈ టోర్నీలో ఓపెన్ సెక్షన్ ప్రైజ్ మనీ రూ.5.37 కోట్లుగా ఉంది. మహిళల విభాగం ప్రైజ్ మనీ రూ.2 కోట్లుగా ఉంది.

ఇవీ చదవండి:

రూ.కోటి శాలరీతో బెంగళూరు స్టార్టప్ సంస్థ జాబ్ ఆఫర్.. కాలేజీ డిగ్రీ లేకున్నా పర్లేదని క్లారిటీ

భార్య నుంచి విడాకులు.. సంబరం తట్టుకోలేక వీధిలోకి వచ్చి..

Read Latest and Viral News

Updated Date - Jul 14 , 2025 | 07:24 PM