Bath in Milk: భార్య నుంచి విడాకులు.. సంబరం తట్టుకోలేక వీధిలోకి వచ్చి..
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:26 PM
కోర్టులో విడాకులు ఖరారు కావడంతో సంబరం తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. అస్సాంలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లంటేనే బెదిరిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక విడాకులు తీసుకున్నాక సంబరాలు చేసుకునే వారూ కోకొల్లలుగా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భార్య తీరుతో విసిగిపోయిన ఓ వ్యక్తికి విడాకులు లభించడంతో అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఆనందం తట్టుకోలేక వీధిలోకి వచ్చి అతడు చేసిన పని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అస్సాంలో ఈ ఘటన జరిగింది. భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉండటంతో మాణిక్ అలీ అనే వ్యక్తి నానా అగచాట్లు పడ్డాడు. రెండు సార్లు ఆమె తన లవర్‌లో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కానీ కుటుంబంలో గొడవలు రేగడం ఇష్టం లేక చాలా కాలం పాటు భరించిన అతడు చివరకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. కోర్టులో ఆ జంటకు విడాకులు ఖరారయ్యాయి. ఈ విషయాన్ని తన లాయర్ ద్వారా తెలుసుకున్న మాణిక్ సంబరం తట్టుకోలేక వీధిలోకి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాడు.
నడి వీధిలో నాలుగు బకెట్ల పాలతో స్నానం చేశాడు. పీడ విరగడైందంటూ మురిసిపోయాడు. ఇన్నాళ్లకు తనకు స్వేచ్ఛ లభించిందంటూ సంబరపడ్డాడు. ‘ఆమె తరచూ తన లవర్‌తో ఇంట్లోంచి వెళ్లిపోయేది. కుటుంబంలో గొడవలు రేగొద్దన్న ఉద్దేశంతో ఇంతకాలం మౌనంగా ఉన్నా. డైవర్స్ ఖరారైందని నిన్న మా లాయర్ తెలిపారు. ఈ స్వేచ్ఛను సెలబ్రేట్ చేసుకునేందుకు ఇలా పాలతో స్నానం చేశా’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియోపై జనాల కామెంట్స్‌కు అంతేలేకుండా పోయింది. మరి ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
రూ.కోటి శాలరీతో బెంగళూరు స్టార్టప్ సంస్థ జాబ్ ఆఫర్.. కాలేజీ డిగ్రీ లేకున్నా పర్లేదని క్లారిటీ
ఈ కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా వైరల్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..