Viral Video: ఆ కొంగకు ఎంత ధైర్యం.. పులులతో పోరు.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..
ABN, Publish Date - Jun 11 , 2025 | 05:27 PM
సాధారణంగా ఇతర జంతువులేవీ పులుల జోలికి వెళ్లవు. పులులతో పోట్లాటకు దిగాలనుకోవు. ఇక, చిన్న జంతువులైతే పులులకు సాధ్యమైనంత దూరంగా ఉంటాయి. అయితే తాజాగా చైనాలో చిత్రీకరించిన వీడియోలో ఓ కొంగ మాత్రం ధైర్యం చేసింది. ఒక పులితో కాదు.. పులుల గుంపుతో పోరాటానికి దిగింది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఇతర జంతువులేవీ పులుల (Tiger) జోలికి వెళ్లవు. పులులతో పోట్లాటకు దిగాలనుకోవు. ఇక, చిన్న జంతువులైతే పులులకు సాధ్యమైనంత దూరంగా ఉంటాయి. అయితే తాజాగా చైనాలో చిత్రీకరించిన వీడియోలో ఓ కొంగ (Crane) మాత్రం ధైర్యం చేసింది. ఒక పులితో కాదు.. ఏకంగా పులుల గుంపుతో పోరాటానికి దిగింది. తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral Video) అవుతోంది.
@Rainmaker1973 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ చెరువు ఒడ్డున కొన్ని పులులు ఉన్నాయి. చెరువులోని నుంచి ఓ కొంగ బయటకు వచ్చింది. అది గాయపడినట్టుగా కనిపిస్తోంది. అది పైకి ఎగరడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. తిరిగి నీటిలోకి వెళ్లడానికి దాని కాళ్లు సహకరించడం లేదు. దీంతో అది పులులతో ముఖాముఖికి సిద్ధమైంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాటానికి దిగింది. అయితే పులుల ముందు కొంగ నిలవడం అసాధ్యమనే సంగతి తెలిసిందే. (crane fought with tigers).
కొంగను పట్టుకుని ఓ పులి చంపేసింది. ఆ పులులన్నీ కలిసి ఆ కొంగను ముక్కలుగా చీల్చుకుని తినేశాయి. ఆ ఘటనను చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకూ 33 లక్షల మంది వీక్షించారు. 14 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. కొంగ పరిస్థితి చూసి జాలి పడ్డారు.
ఇవి కూడా చదవండి..
Ice Bath Video: వావ్.. ఏం ఐడియా గురూ.. వేసవిలో చన్నీళ్ల స్నానానికి సూపర్ ట్రిక్..
Piggy Bank: అదృష్టం ఇలా కూడా వరిస్తుందా.. బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 11 , 2025 | 06:13 PM