Ice Bath Video: వావ్.. ఏం ఐడియా గురూ.. వేసవిలో చన్నీళ్ల స్నానానికి సూపర్ ట్రిక్..
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:41 PM
వేసవి కాలం వచ్చిందంటే గాలి, నేల, నీరు అంతా హాట్ హాట్ అయిపోతుంది. ట్యాంక్‌లో నిల్వ చేసే నీళ్లు ఎండ కారణంగా వేడెక్కిపోతాయి. ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నుంచి పొగలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చన్నీళ్ల స్నానం చేయాలనుకునే వారి కోసం సూపర్ ట్రిక్‌ను కనిపెట్టాడు.

మన దేశంలో వేసవి కాలం (Summer) వచ్చిందంటే మొత్తం వేడిగా మారిపోతుంది. గాలి, నేల, నీరు అంతా హాట్ హాట్ అయిపోతుంది. ట్యాంక్‌లో నిల్వ చేసే నీళ్లు ఎండ కారణంగా వేడెక్కిపోతాయి (Hot water). ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నుంచి పొగలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చన్నీళ్ల స్నానం (Cool Water) చేయాలనుకునే వారి కోసం సూపర్ ట్రిక్‌ను కనిపెట్టాడు. ఆ వీడియో చూస్తే అతడి తెలివితేటలను ప్రశంసించకుండా ఉండలేం. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Jugaad Video).
diya_jitendrasinh అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి షవర్ కింద్ర ఓ జల్లెడలాంటిది పెట్టి దాంట్లో ఐస్ ముక్కలు వేశాడు. దీంతో షవర్ నుంచి వచ్చే నీరు మంచు ముక్కలపై పడి చల్లగా మారి అతడిపై పడుతోంది. దీంతో అతడు వేసవిలో కూడా చన్నీళ్లతో చక్కగా స్నానం చేస్తున్నాడు. ఆ నీటి చల్లదనం కారణంగా అతడు వణుకుతుండడం వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 37 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఈ ఐడియా చాలా గొప్పగా ఉందని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. తాము కూడా ఇలాగే ప్రయత్నిస్తామని కొందరు కామెంట్లు చేశారు. ఈ టెక్నాలజీ ఇండియా నుంచి బయటకు వెళ్లకూడదని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Piggy Bank: అదృష్టం ఇలా కూడా వరిస్తుందా.. బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..