Piggy Bank: అదృష్టం ఇలా కూడా వరిస్తుందా.. బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:12 PM
అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో, ఎలా వరిస్తుందో చెప్పలేం. ఆ సమయం వచ్చినపుడు మట్టిని తవ్వుతున్నా బంగారు గని దొరుకుతుంది. తాజాగా ఓ వ్యక్తికి అలాగే జరిగింది. ఆ వ్యక్తి మట్టి తవ్వుతుండగా అతడికి బంగారు నిధి దొరికింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అదృష్టం (Luck) ఎప్పుడు, ఏ రూపంలో, ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఆ సమయం వచ్చినపుడు మట్టిని తవ్వుతున్నా బంగారు గని దొరుకుతుంది. తాజాగా ఓ వ్యక్తికి అలాగే జరిగింది. ఆ వ్యక్తి మట్టి తవ్వుతుండగా ఏకంగా బంగారు (Gold) నిధి దొరికింది. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి అతడి అదృష్టాన్ని కొనియాడుతున్నారు (Man found hidden treasure).
treasure_sniiper అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి భూమిలో తవ్వుతున్నట్లు చూడవచ్చు. కాసేపటికి అతడికి మట్టిలో ఏదో వస్తువు దొరికింది. ఓ మట్టి కుండ లాంటి వస్తువు కనిపించింది. మొదట అది విరిగిన వస్తువు అని అతను అనుకుంటాడు. అయితే అతను దానిని పగలగొట్టినప్పుడు, లోపల బంగారు ఆభరణాలు, నాణేలు కనబడ్డాయి. ఇవి పాత కాలం నాటి నిజమైన నాణేలు అని చాలా మంది భావిస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు పది లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 93 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది ఎవరో రాజుకు చెందిన పాత నిధి అయ్యుంటుందని ఒకరు కామెంట్ చేశారు. ఇప్పటివరకు మనమందరం తప్పు ప్రదేశంలో వెతుకుతున్నట్లు అనిపిస్తోందని మరొకరు సరదాగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Stunt with Dolphins: వామ్మో.. ఇదెక్కడి స్టంట్ రా బాబూ.. డాల్ఫిన్లతో కూడా ఇలా చేస్తారా
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..