Share News

Stunt with Dolphins: వామ్మో.. ఇదెక్కడి స్టంట్ రా బాబూ.. డాల్ఫిన్లతో కూడా ఇలా చేస్తారా

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:46 PM

డాల్ఫిన్లతో స్నేహం చేయడం, వాటితో స్టంట్లు చేయడం చాలా ప్రమాదకరం. అయితే అంతటి ప్రమాదకర పనిని ఓ వ్యక్తి చాలా సునాయాసంగా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Stunt with Dolphins: వామ్మో.. ఇదెక్కడి స్టంట్ రా బాబూ.. డాల్ఫిన్లతో కూడా ఇలా చేస్తారా
Stunt with Dolphins

సాధారణంగా సముద్ర జీవులు మనుషులకు మచ్చిక కావు. డాల్ఫిన్ల (Dolphins)తో స్నేహం చేయడం, వాటితో స్టంట్లు చేయడం చాలా ప్రమాదకరం. అయితే అంతటి ప్రమాదకర పనిని ఓ వ్యక్తి చాలా సునాయాసంగా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఒకేసారి రెండు డాల్ఫిన్లతో సర్ఫింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ స్టంట్‌ను చూడడానికి చాలా మంది స్టేడియంకు వెళ్లారు (Stunt with Dolphins).


elkho0ly అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి స్విమ్మింగ్ ఫూల్‌లో ఈదుతున్న రెండు డాల్ఫిన్ల తలలపై నిలబడ్డాడు. ఆ రెండు డాల్ఫిన్లు ఒకే వేగంతో ప్రయాణిస్తూ అతడిని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఆ వ్యక్తి అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు డాల్ఫిన్లతో ఒకేసారి సర్ఫింగ్ చేశాడు. ఆ వ్యక్తి ఓ ప్రొఫెషనల్ ట్రైనర్ అయి ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు. దీనిని మ్యాజిక్ స్టంట్ అని చాలా మంది పిలుస్తున్నారు.


ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. 79 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. మానవులకు, జంతువులకు మధ్య ఇంత అవగాహన ఉండటం ఆశ్చర్యంగా ఉందని ఒకరు కామెంట్ చేశారు. జంతువులను ఈ విధంగా ఉపయోగించడం సరైనదేనా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ కళ్లకు సవాల్.. ఈ గదిలో మొబైల్ ఎక్కడుందో 5 సెకెన్లలో వెతికిపెట్టండి


JSW Shares: అదృష్టం అంటే ఇతడిదే.. తండ్రి చేసిన పనితో లైఫ్ సెటిల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 04:46 PM